Akhil: అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ఏజెంట్. స్పై థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి. మొదట ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయటానికి ప్రయత్నాలు చేశారు . కానీ కొన్ని కారణాలవల్ల ప్రస్తుతం కేవలం తెలుగులో మాత్రమే ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఏజెంట్ సినిమాకి అఖిల్ రెమ్యూనరేషన్ గురించి నిర్మాత అనిల్ సుంకర అసలు విషయం బయట పెట్టాడు. 80 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఏజెంట్ సినిమాకి అఖిల్ రెమ్యూనరేషన్ తీసుకోకుండానే పనిచేసినట్లు నిర్మాత అనిల్ సుంకర వెల్లడించాడు. ఎందుకంటే ఏజెంట్ సినిమా నిర్మాణంలో అఖిల్ తో పాటు దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా భాగమయ్యారని, ఆయన మొదట్నుంచి భాగస్వామిగానే ఉన్నారని అనిల్ సుంకర తెలిపారు.
ఏజెంట్ కోసం పనిచేసిన అందరు వాళ్ల మొత్తం పారితోషికం తీసుకుంటే ఈ సినిమా బడ్జెట్ 100 కోట్లు ఉంటుందని ఆయన తెలిపాడు.ఇలా ఏజెంట్ కోసం అఖిల్, సురేందర్ రెడ్డి ఇద్దరు కూడా పారితోషికం తీసుకోకుండా తన పారితోషికాన్ని ప్రొడక్షన్ రూపంలో వదులుకున్నారని తెలిపారు. .అఖిల్, సురేందర్‌రెడ్డి పారితోషికం తీసుకోకుండానే ఈ సినిమాకి పనిచేసినట్లు అనిల్ సుంకర పరోక్షంగా తెలిపాడు.
ఇప్పటివరకు అఖిల్ కి సరైన హిట్ ఒక్కటి కూడా లేదు. అయినప్పటికీ అనిల్ అఖిల్ తో ఇలా 80 కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమా చేయటం రిస్క్ తో కూడుకున్న పని. అయితే యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథ కావడంతో సినిమా నెమ్మదిగా పాన్ ఇండియా రేంజ్‌లో రీచ్ అవుతుందని నమ్మకం ఉండటంతో ఈ బడ్జెట్ పెద్ద సమస్య కాదని, థియేట్రికల్‌గా, డిజిటల్ పరంగా సినిమా సేఫ్‌లోనే ఉంటామని మేకర్స్ భావించి బడ్జేట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…