Gummadi Sharada : అప్పటి సినిమా హీరోలకు తండ్రి పాత్రలో ఎక్కువగా కనిపించి ఆయన కన్నా వయసులో పెద్ద హీరోలకు తండ్రిగా నటించి పేరు తెచ్చికున్న నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. గుంటూరు జిల్లాకు చెందిన ఆయన చదువుకునే సమయంలోనే నాటకాల మీద మక్కువతో నాటకాలు వేసేవారు. ఆ తరువాత సినిమాల్లో నటించడానికి మద్రాస్ వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నంచారు. ఇక మొదట్లో అంతగా అవకాశాలు రాకపోయినా ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎక్కువ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. సుమారు 500 లకు పైగా సినిమాల్లో నటించిన ఆయన గురించిన వివరాలను ఆయన కూతురు గుమ్మడి శారద గారు వివరించారు.
పెరాలసిస్ తో బాధపడ్డారు…
నటుడుగా కెరీర్ పీక్స్ లో ఉండి ఎన్నో సినిమాల్లో నటిస్తూ ఉన్న సమయంలోనే గుమ్మడి గారికి మైల్డ్ పెరాలసిస్ రావడంతో మందులు వాడటం వల్ల స్వరపేటీక దెబ్బ తిని మాట పడిపోయిందట. మళ్ళీ మాట రావడానికి కొన్ని నెలల సమయం పట్టిందని ఆ తరువాత మళ్ళీ సినిమాలలో నటించారని గుమ్మడి గారి అమ్మాయి శారద వివరించారు. ఇక ఆయన పెరాలసిస్ తో బాధపడుతున్న సమయంలోనే గుండె బలహీన పడటంతో ఆ తరువాత రోజుల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించాల్సి వచ్చిందని తెలిపారు శారద.
అయితే గుండె బలహీన పడటంతో అయన మరణించారని కానీ ఆయన మరణించే వరకు కూడా చాలా సంతోషంగా ఉండేవారంటూ తెలిపారు. ప్రతిరోజు ఇంటికి గిరిబాబు, సత్యనారాయణ వంటి వారు ఎవరో ఒకరు వచ్చి కబుర్లు చెప్పేవారని, ప్రతిరోజూ ఇంట్లో ఎవరో ఒకరు నాన్నతో మాట్లాడుతూ అప్పటి నాటకాల్లోని పద్యాలను పడుతూ అలా కాలక్షేపం జరిగేదంటూ శారద చెప్పారు. ఒంటరితనం ఎపుడూ నాన్న గారికి లేదంటూ ప్రశాంతంగా ఆయన జీవితం సాగిందని వివరించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…