Guntturu kaaram: మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం గుంటూరు కారం.ఈ సినిమా గత ఏడాది షూటింగ్ పనులను ప్రారంభించుకుంది అయితే ఇప్పటివరకు సినిమా షూటింగ్ పనులు మాత్రం ముందుకు సాగలేదు. కొన్ని కారణాలవల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూనే వస్తుంది.
ఇక ఈ సినిమా తాజాగా మరో షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభించుకుందని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా లోమహేష్ బాబుకి జోడిగా పూజ హెగ్డే నటించబోతున్న విషయం మనకు తెలిసిందే. కానీ కొన్ని కారణాల వల్ల పూజా హెగ్డే ఈ సినిమా నుంచి తప్పుకున్నారు దీంతో పూజ స్థానంలో నటించే మరో హీరోయిన్ ఎవరు అంటూ పెద్ద ఎత్తున హీరోయిన్ గురించి వార్తలు హల్చల్ చేశాయి.
ఇకపోతే పూజ హెగ్డే స్థానంలో నటి మీనాక్షి చౌదరి నటించబోతున్నారంటూ స్వయంగా ఆమె ప్రకటించారు. దీంతో పూజ స్థానంలో మీనాక్షి చౌదరి సెట్ లోకి అడుగు పెట్టారని ప్రస్తుతం షూటింగ్ పనులు జరుపుకుంటున్న తెలుస్తుంది. మీనాక్షి చౌదరి నటించిన హత్య సినిమా త్వరలోనే విడుదల కానుంది. దీంతో హైదరాబాదులో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె మాట్లాడుతూ తాను గుంటూరు కారం సినిమాలో నటించడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ సినిమాలో మహేష్ బాబు గారితో కలిసి నటించిన మొదటి రోజు అనుభూతి ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు. ఇలా ఈమె గుంటూరు కారం సినిమాలో నటించబోతున్నాననే విషయాన్ని తెలియజేయడంతో పూజ స్థానంలో మీనాక్షి చౌదరి ఎంపికయ్యారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో మరొక హీరోయిన్ శ్రీ లీల కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.
కేరళలోని ప్రముఖ రిటైల్ స్పేస్ కంపెనీ హైలైట్ గ్రూప్ తన 30వ వార్షికోత్సవం సందర్భంగా ఉద్యోగులను అదిరిపోయే విధంగా సర్‌ప్రైజ్…
టీమిండియా నెక్స్ట్ జనరేషన్ స్టార్, 14 ఏళ్ల క్రికెట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు మోస్ట్ టాక్‌డ్ పేర్లలో ఒకరు.…
సర్పంచులకు ఉపశమనం.. నిలిచిన నిధుల వినియోగానికి అనుమతి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. Government of…
ఉత్తరప్రదేశ్‌లోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలిచివేసే సంఘటన చోటుచేసుకుంది. బహ్రైచ్ జిల్లాలోని నంద్వాల్ గ్రామానికి చెందిన 35 ఏళ్ల గర్భిణి ప్రసవ…
తెలుగు చిత్రసీమలో కంటెంట్ ఆధారిత కథలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు తన కెరీర్‌లో సుహాస్ ఇప్పుడు…
టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా గుర్తింపు పొందిన రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన వ్యక్తిగత వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…