GV Narayana Rao : తెలుగు చలన చిత్రసీమలో చాలామంది నటులు మంచి గుర్తింపు సాధించినప్పటికీ కొంతమందికి మాత్రం ఎన్ని సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు అనేది రాదు. ఎందుకంటే వాళ్లకి తగ్గ క్యారెక్టర్ సినిమాల్లో పడకపోవచ్చు, అందుకే చాలా మంది నటులు వారిలో అద్భుతమైన నటన ప్రతిభ ఉన్నప్పటికీ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోలేక పోతున్నారు. కొంతమంది మాత్రం హీరోలుగా ఇండస్ట్రీలో వెలిగిపోతూ ఉంటే కొందరు మాత్రం నటన బాగా వచ్చి కూడా సరైన క్యారెక్టర్ దొరక్క దానికోసం ఇంకా పరితపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్లలో నారాయణరావు ఒకరు ఆయన బిఎస్సి చదువుతున్నప్పుడు సినిమాల మీద ఇంట్రెస్ట్ తో ఇల్లు వదిలి మద్రాసుకి వచ్చి అక్కడ అవకాశాల కోసం ఎదురు చూస్తూ… ఆ తర్వాత ఏం జరిగిందనేది నారాయణరావు మాటల్లో…
సినిమాలంటే ఏదో పిచ్చి నటించాలన్న ఆతృత ఇవన్నీ నన్ను మద్రాస్ వరకు తీసుకొచ్చాయి. అలా నటనలో రెండు ఏళ్లపాటు శిక్షణ తీసుకున్నాను. కొత్త వాళ్లతో సినిమా తీస్తున్నానని దర్శకుడు బాలచందర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కు వచ్చారు. అక్కడ మా నటన చూసిన ఆయన తీయబోయే ‘అంతులేని కథ’ చిత్రంలో నాకు రజనీకాంత్ కి అవకాశం ఇచ్చారు. అలా మేమిద్దరం కలిసి “అంతులేని కథ” చిత్రంలో నటించాం. నాకు ఈ సినిమాకి స్టేట్ అవార్డు వచ్చింది. ఆ తరువాత ఈరాంకీశర్మ దర్శకత్వంలో విడుదలైన “చిలుకమ్మ చెప్పింది” చిత్రంలో నా పాత్రకి మంచి పేరు వచ్చింది. ఈ సినిమాకి దాదాపుగా నాకు పది అవార్డులు వచ్చాయి. ఆ తర్వాత రంజిత్ కుమార్ నిర్మాణం, ఈరంకిశర్మ దర్శకత్వంలో ‘నాలాగ ఎందరో’ చిత్రంలో నేను నటించాను. ఆ సినిమాకి నాకు విపరీతమైన పేరు వచ్చింది. ఆ చిత్రానికి కూడా అవార్డులు వచ్చాయి.
ఆ తర్వాత బెంగాల్లో కఫాన్ అనే నవల ఆధారంగా తెలుగులో “ఒక ఊరి కథ” చిత్రంలో నేను నటించాను. ఈ సినిమాకి కేవలం భారత్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది. ఈ సినిమా అనేక ప్రపంచ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శింపబడింది. చేకోస్లోవియా, న్యూయార్క్, ఫ్రాన్స్ లాంటి అనేక దేశాల్లో జరిగిన ఫెస్టివల్స్ కి నేను హాజరయ్యాను. ఒక రకంగా చెప్పాలి అంటే ఒక సంవత్సరం ఆ ఫిల్మ్ ఫెస్టివల్స్ కి హాజరవ్వడానికే నాకు సమయం పట్టింది. ఆ తర్వాత కమర్షియల్ చిత్రాలు కాకుండా సెలెక్టివ్ గా మంచి కథా బలం ఉన్న పాత్రలనే ఎన్నుకున్నాను. అలా నాకు అవకాశాలు తగ్గడం మొదలుపెట్టాయి. కానీ నా స్నేహితులిద్దరూ రజనీకాంత్, చిరంజీవి కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూ.. ఒకరు తమిళ్లో మరొకరు తెలుగులో నెంబర్ వన్ హీరోలుగా ఉండడం నాకు ఆనందంగా ఉందని ఆయన వివరించారు.
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…