Categories: FeaturedMovie News

Gym Trainer Kuldeep Sethi : రామ్ చరణ్ చాలా డౌన్ టూ ఎర్త్, మొదట్లో చిరంజీవి కొడుకు అన్న విషయం కూడా నాకు తెలియదు.. జిమ్ ట్రైనర్ కుల్దీప్ సేథి ఆసక్తికర వ్యాఖ్యలు..!

Gym Trainer Kuldeep Sethi : ప్రస్తుతం హీరోలు సినిమాకు తగ్గట్టు తమ బాడీ షేప్ ను మార్చేస్తుంటారు. దీనికోసం ప్రత్యేకంగా జిమ్ ట్రైనర్ లను పెట్టుకొని మరీ కష్టపడటం తెలిసిందే. ఇలాంటి సెలబ్రిటీ జిమ్ ట్రైనర్లలో ఒకరు కుల్దీప్ సేథి. ఈయన 360 డిగ్రిస్ అనే పేరుతో జిమ్ ని నడుపుతున్నారు. 2004వ సంవత్సరం నుండి జిమ్ ట్రైనర్ గా పనిచేస్తున్న ఈయన 18 ఏళ్లలో చాలా మంది సెలబ్రిటీలకు ట్రైనర్ గా చేసాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కుల్దీప్ సేథి చాలా ఆసక్తికర విషయాలు చెప్పారు.

మొదట నేను ట్రైనింగ్ ఇచ్చింది రామ్ చరణ్ గారికే…

ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కుల్దీప్ సేథి రామ్ చరణ్ తో పరిచయం గురించి చెప్పుకొచ్చారు. నేను సెలబ్రిటీలలో మొదట ట్రైనింగ్ ఇచ్చింది రామ్ చరణ్ గారికే. తన మొదటి సినిమా ‘చిరుత’ కోసం నా దగ్గరకు వచ్చారు. చిరంజీవి కొడుకు అని అపుడు నాకు తెలియదు. తరువాత నా ఫ్రెండ్ ద్వారా తెలిసి, ఎందుకు మీరు నాకు చెప్పలేదు అని ప్రశ్నించగా.. అందులో ఏముంది అని చాలా సింపుల్ గా సమాధానం చెప్పారు. ఆయన చాలా డౌన్ టూ ఎర్త్, చాలా మంచి మనిషి అని చెప్పుకొచ్చారు.

తరువాత మెగాస్టార్ కి కూడా రెండు సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చే అవకాశం దొరికింది అని ఆనందం వ్యక్త పరిచారు. అప్పట్లో కళ్యాణ్ రామ్ ‘ఇజం’ సినిమా కోసం సిక్స్ ప్యాక్ బాడీ ట్రైనింగ్ నేనే ఇచ్చాను. వీరితో పాటు వరుణ్ తేజ్ నా దగ్గర దాదాపు 7 సంవత్సరాల పాటు ట్రైనింగ్ తీసుకున్నారు. ఇక తాజాగా లైగర్ సినిమా కోసం విజయ్ కి కూడా నేనే ట్రైనింగ్ ఇచ్చాను అని చెప్పుకొచ్చారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago