Featured

Sid Sriram : సిద్ శ్రీరామ్ పాటలలో తెలుగును చంపేస్తున్నాడు.. అవన్నీ తప్పులే.. వైరల్ అవుతున్న వీడియో..!

Sid Sriram : ఎంతో మందో నేటితరం సింగర్స్ ఉన్నా అందరిలోనూ సిద్ శ్రీరామ్ వేరు. ఒక స్టార్ హీరో కి ఉన్నంత ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. సిద్ శ్రీరామ్ పాడిన పాట ఒక్కటైనా సినిమాలో ఉంటే చాలు అనేలా సినిమా తీసే వాళ్ళు భావిస్తున్నారు. ఇపుడు సౌత్ లో ఫుల్ క్రేజ్ ఉన్న సింగర్ అంటే సిద్ శ్రీరామే. ఇక తెలుగులో క్రేజ్ గురించి వేరే చెప్పకర్లేదు. ‘ఇంకేం ఇంకేం కావాలె’ అంటూ పాడినా, ‘చూపే బంగారమాయేనా శ్రీ వల్లి’ అని పాడినా ఆడియన్స్ మాత్రం అతని గాత్రానికి ఫిదా అయిపోతున్నారు. సౌత్ సింగర్స్ లో ఇపుడు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సింగర్ కూడా సిద్ శ్రీరామే. అయితే శ్రీరామ్ పాటల్లో పద ఉచ్చారణ గురించి ఇంతకు ముందు కూడా చర్చ జరిగింది.

తెలుగు పద ఉచ్చారణ సరిగా లేదు…

తాజాగా పమిడికాల్వ మధు అనే వ్యక్తి యూట్యూబ్ ద్వారా సిద్ పాడిన తెలుగు పాటలపై అభ్యంతరం వ్యక్తం చేసాడు. తెలుగు ఉచ్చారణ సరిగా రాదని కొన్ని పదాలను తప్పుగా పలుకుతున్నాడు అని చెప్పారు. ఇక నుంచైనా సిద్ శ్రీరామ్ పాడే పాటల్లో ఉంటే.. కంటే.. ఒంటి.. అనే పదాలను రాయొద్దు వాటిని అతడు ఉల్టే.. కల్టే.. ఒల్టి అని తప్పుగా పాడుతున్నాడు అని విమర్శించారు. అలాగే దాక్కుందాం.. పదాన్ని దాల్కుందాం అని, కొట్టుకుందాం అనే పదాన్ని కొట్టుకుల్దాం ని పాడి తెలుగు పదాలను చంపేస్తున్నాడని వాపోయాడు.

ఇప్పటికైనా సంగీత దర్శకులు, హీరోలు వీటిని గమనిస్తే మంచిది మీకు ఇవన్నీ ఎన్ని రోజులు కనిపించలేదా అంటూ మాట్లాడారు. దీనికి సంబంధిచిన వీడియో ఒకటి నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. కొంతమంది నెటిజన్స్ ఈ వీడియోకి స్పందిస్తూ ఇప్పటికైనా ఒకరు దీన్ని గురించి మాటాడారు సంతోషం అంటూ చెప్పగా, మరొకరు నిజమే ఈ తప్పులను సరిదిద్దుకుంటే సిద్ మంచిది అంటూ చెబుతున్నారు. ఇక అలా వైకుంఠ పురంలో సినిమాలో ‘సామజవరగమనా’ పాట పాడిన సమయంలో కూడా మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణి మాలిక్ సిద్ ఉచ్చారణ గురించి కామెంట్స్ చేసారు. పాట చాలా బాగుంది ఒక తెలుగు సింగర్ తో పాట పాడించుంటే బాగుండేది అంటూ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

టికెట్ పెంపుపై దుమారం… చివరకు తగ్గిన దేవస్థానం!

శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…

3 minutes ago

52లోనూ ఫిట్‌గా ఆమని.. రోజూ ఇదే రూటీన్ అంటోంది హీరోయిన్

తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్‌గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…

41 minutes ago

నైటీ వేసుకుందన్న కోపం.. భార్యపై నిప్పంటించిన భర్త

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…

11 hours ago

సైన్స్ vs నమ్మకాలు.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…

11 hours ago

మెగాస్టార్ ఇంటి పక్కనే అల్లు అర్జున్ కలల గృహం.. రూ.80 కోట్ల మేన్షన్ నిర్మాణం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…

11 hours ago

నాదెండ్ల భాస్కర్ రావు ఇకలేరు.. విభిన్న రాజకీయ ప్రయాణం ముగిసింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…

11 hours ago