Hansika: బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హన్సిక అనంతరం అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమయ్యారు.ఇలా హీరోయిన్ గా మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ అతి తక్కువ సమయంలోనే ఆగ్ర హీరోయిన్ గా పేరు పొందారు.
ఇలా వరుస సినిమాలతో ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడిపిన హన్సిక ప్రస్తుతం పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈమె వివాహం లవ్ షాది డ్రామా పేరుతో డిజిటల్ మీడియాలో ప్రసారమవుతుంది అయితే ఈ లవ్ షాది డ్రామా రెండవ ఎపిసోడ్ లో భాగంగా హన్సిక మాట్లాడుతూ గతంలో తన గురించి వచ్చినటువంటి వార్తలపై స్పందించారు.అయితే గతంలో ఈమె చాలా త్వరగా ఎదగడం కోసం హార్మోన్ ఇంజక్షన్లు వేయించుకున్నారు అంటూ వార్తలు వచ్చాయి.
ఈ విషయంపై స్పందించిన హన్సిక తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ వార్తలలో ఏ మాత్రం నిజం లేదని కొట్టిపారేశారు.ఇలా హన్సిక ఈ విషయం గురించి మాట్లాడుతున్న సమయంలోనే మధ్యలో తన తల్లి కూడా మాట్లాడుతూ ఇలాంటి వార్తలు రాయడానికి కొంచమైనా బుద్ధుండాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలా తన కూతురికి హార్మోన్స్ ఇంజక్షన్లు వేయించి ఉంటే కనుక నేను ఇప్పటికే టాటా బిర్లా వంటి ధనవంతులుగా మారిపోయే దాన్ని మీరు కూడా ఇంత తొందరగా ఎదగడానికి చిట్కాలు చెప్పమంటూ నా ముందు క్యూ కట్టేవారు.ఇలాంటి ఇంజక్షన్లు వేయించుకోవాలంటే ఎంతో డబ్బు అవసరం అవుతుందని అది కేవలం ధనవంతులకు మాత్రమే సాధ్యపడుతుందని తెలిపారు. అయినా తన కుమార్తె ఎదుగుదల గురించి ఇలాంటి అసత్యపు వార్తలు రాయడం సిగ్గుచేటు అంటూ ఈ సందర్భంగా హన్సిక తల్లి తన కుమార్తె గురించి వచ్చిన వార్తలపై స్పందిస్తూ ఆ వార్తలను పూర్తిగా ఖండించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…