Lakshmi Parvathi : నందమూరి తారకరత్న మరణించాక ఆయన మరణానికి కారణం లోకేష్ పాదయాత్ర అంటూ విమర్శిస్తున్న వాళ్లలో లక్ష్మీపార్వతి ఒకరు. నిజానికి తారకరత్న లోకేష్ పాదయాత్ర కుప్పంలో మొదలుపెట్టిన ఆరోజే జనవరి 27న మరణించినా చంద్రబాబు దాచిపెట్టి తారకరత్నను హాస్పిటల్లో చికిత్స పేరుతో ఉంచి ఇప్పుడు మరణించాడని బయటికి చెప్పారంటూ ఒకవైపు వినిపిస్తున్నా వైసీపీ నేత విజయసాయి రెడ్డి కూడా తారకరత్న హాస్పిటల్ లో ఉన్నపుడు వెళ్ళి పరామర్శించడం మీడియా ముందు కోలుకొంటాడు అంటూ మాట్లాడటం జరిగింది. అయితే తారకరత్న మరణించి ఆ కుటుంబం దుఃఖంలో ఉంటే ఇలాంటి చర్చలేమిటి అనే వాదన ఉంది. ఇక నారా చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద ఛాన్స్ వస్తే విమర్శించడానికి రెడీ గా ఉండే లక్ష్మి పార్వతి గారు తారకరత్న మరణం గురించి మీడియాతో మాట్లాడారు.
నా కుటుంబంలో ఇంకెంతమంది వారి వల్ల మరణిస్తారో…
లక్ష్మి పార్వతో గారు మాట్లాడుతూ ఆ రోజు నా భర్త ఈరోజు నా మనవడు.. చంద్రబాబు, లోకేష్ స్వార్థంకు బలయ్యారు. నా కుటుంబంలో తీరని విషాదనికి కారణం వాళ్ళే, ఇంకెంతమంది వారి వల్ల మరణిస్తారు. చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరూ అపశకునం అని ఈపాటికి జనాలందరికీ అర్థమైపోయింది. ఆ అబ్బాయి తారకరత్న వీరికి మంచి చేయడం కోసం పాదయాత్రకు వెళితే ఆ అబ్బాయికి అలా జరిగింది.
డాక్టర్లు ఆరోజే మరణించాడని గుండె ఆగిపోయిందని చెప్పినా కొడుకు పాదయాత్ర మొదటి రోజు అని అపశకునం అనుకుంటారని ఇన్నిరోజులు రాజకీయ డ్రామా ఆడారు. వీళ్ళ రాజకీయ స్వార్థంకి హద్దే లేకుండా పోయింది. ఆనాడు నా భర్త వీరి స్వార్థంకి బలయ్యాడు నేడు మంచిపిల్లాడు తారకరత్న బలయ్యాడు అంటూ లక్ష్మి పార్వతి చంద్రబాబు నాయుడు లోకేష్ లను విమర్శించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…