Hansika: హన్సిక పరిచయం అవసరం లేనీ పేరు.యాపిల్ బ్యూటీగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఇలా హన్సిక తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ అగ్రతారక ఓ వెలుగు వెలిగారు. అయితే గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి హన్సిక తాజాగా పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.
ఈ విధంగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన హన్సిక తన పెళ్లికి సంబంధించిన విషయాలను లవ్ షాది డ్రామా పేరుతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోని ఈమె ఎన్నో తన వ్యక్తిగత విషయాలను కూడా తెలియజేశారు. గతంలో తన గురించి వచ్చినటువంటి వార్తలను కూడా పూర్తిగా ఖండించారు.
ఇకపోతే హన్సిక ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలోనే ఈమె నటుడు శింబు ప్రేమలో పడ్డారని కొన్ని కారణాలవల్ల వీరి ప్రేమ బ్రేకప్ అయ్యిందనే విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈమె తన ఫస్ట్ బ్రేకప్ గురించి కూడా ఓపెన్ అవుతూ పలు విషయాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా హన్సిక మాట్లాడుతూ నా గత రిలేషన్షిప్ చాలా విచిత్రంగా సాగింది. కానీ అది ఇప్పుడు ముగిసిన కథ. ఒకసారి బ్రేకప్ అయిన తర్వాత తిరిగి ఎస్ చెప్పడానికి ఎనిమిది సంవత్సరాల సమయం పట్టింది. దేవుడు తనకు మంచి దారి చూపించాడని ఈమె సంతోషం వ్యక్తం చేశారు.తాను ఒక రొమాంటిక్ పర్సన్ అని ప్రేమ పెళ్లి మీద తనకు నమ్మకం పోయాయని అయితే సోహైల్ నా జీవితంలోకి వచ్చిన తర్వాత ప్రేమ మీద నమ్మకం ఏర్పడి తిరిగి తనతో కొత్త ప్రయాణం మొదలు పెట్టానని తెలియజేశారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…