Movie News

Gunturu Kaaram: గుంటూరు కారం సినిమా పరిస్థితి చాలా దారుణం.. ఆ సినిమాకు క్యూ కడుతున్న అభిమానులు?

Gunturu Kaaram: తాజాగా గుంటూరు కారం జై హనుమాన్ సినిమాలు విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే. మొదటినుంచి ఈ రెండు సినిమాలపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. సినిమా విడుదలకు ముందు రెండు సినిమాలు కూడా ఈక్వల్ గానే ప్రమోషన్స్ కార్యక్రమాలు చేయబడుతూ వచ్చాయి. కానీ ఎక్కువ శాతం ప్రేక్షకులు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాపై ఆసక్తిని చూపించారు. కానీ బుక్ మై షో అలాంటి టికెట్ బుకింగ్ యాప్ లలో మాత్రం హనుమాన్ సినిమాకే ఎక్కువ శాతం మెజారిటీ వచ్చింది. అయితే తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలచినట్టు గుంటూరు కారం సినిమా పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా బ్యాడ్ టాక్ ని తెచ్చుకోవడం తోపాటు కలెక్షన్ల విషయంలో కూడా వెనుక పడుతోంది. మరోవైపు హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. గుంటూరు కారం పరిస్థితి దారుణంగా మారింది. సంక్రాంతికి వచ్చింది కాబట్టే ఈ మాత్రం వసూళ్లైనా వచ్చాయి. లేదంటే డిజాస్టర్‌గా నిలిచి రెండో రోజే జెండా ఎత్తే పరిస్థితి వచ్చేది. గుంటూరు కారం సినిమాకు బ్యాడ్ రివ్యూలు, బ్యాడ్ మౌత్ టాక్ వచ్చింది. జనాలు గుంటూరు కారం వైపు చూడటం లేదు. ఈ విషయాన్ని బుక్ మై షో చూస్తే అర్థం అవుతుంది.

గుంటూరు కారంకు డిమాండ్ లేకపోయినా కూడా థియేటర్లు ఉన్నాయి. నైజాంలో గుంటూరు కారంకే థియేటర్లు ఇచ్చారు. ఇప్పుడు సినిమాను జనాలు చూడాలనుకోవడం లేదు. అయినా కూడా అదే సినిమాను థియేటర్లలో ఆడిస్తున్నారు. అదే ఆంధ్రలో అయితే డిమాండ్ ఉన్న సినిమాను వేసుకుంటున్నారు. హనుమాన్ సినిమాకు అక్కడ ఇరవై శాతం స్క్రీన్‌లు పెరిగాయని తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు విడుదలకు ముందు ఎక్కువ థియేటర్స్ లో గుంటూరు కారం సినిమా విడుదల అవ్వగా ప్రస్తుతం ఎక్కువ థియేటర్స్ లో హనుమాన్ సినిమానే ప్రదర్శితం అవుతుంది.

హనుమాన్ సినిమాను ముందు నుంచి కూడా నైజాం ఏరియాలో అడుగు పెట్టనివ్వలేదు. దిల్ రాజు ఉన్న థియేటర్లన్నీ కూడా గుంటూరు కారంకే ఇచ్చాడు. ఇక శిరీష్ రెడ్డి అయితే హనుమాన్ గురించి దారుణంగా మాట్లాడాడు. గుంటూరు కారంతో పోలిక ఏంటి కావాలంటే నా సామిరంగాతో పోల్చుకోమను అంటూ కాస్త దురుసుగా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఇండస్ట్రీలో చాలా మంది హనుమాన్‌ను తక్కువ అంచనా వేశాడు. ఇదేం ఆడుద్దిలే అని లైట్ తీసుకున్నారు. చివరకు రిజల్ట్ చూస్తే టాలీవుడ్ తలెత్తుకునేలా చేసింది హనుమాన్.

గుంటూరు కారంని వెనక్కి నెట్టేసిన హనుమాన్..

ఇండియా మొత్తం ప్రశాంత్ వర్మకు సలాం కొట్టే పరిస్థితి వచ్చింది. ఇంత తక్కువ బడ్జెట్‌లో అంత క్వాలిటీ ఎలా వచ్చిందంటూ బాలీవుడ్ సైతం షాక్ అవుతోంది. ఒక వేళ డిమాండ్‌కు తగ్గట్టుగా హనుమాన్‌కు థియేటర్లు ఇచ్చి ఉంటే కలెక్షన్లు వేరేలా ఉండేవి. కేవలం ప్రీమియర్లతోనే నైైజాంలో రెండున్నర కోట్లకు పైగా వసూళ్ చేసింది హనుమాన్. అదే పూర్తి స్థాయిలో థియేటర్లు ఇచ్చి ఉంటే దుమ్ములేపేసేది. ఇప్పుడు హైద్రాబాద్‌లోనే గుంటూరు కారంకు 712 షోలు ఉంటే అందులో కనీసం 250 కూడా ఫుల్ అవ్వలేదు. అదే హనుమాన్‌ను చూసుకుంటే 230కి 228 ఫుల్ అయ్యాయి. అంటే ఏ రేంజ్‌లో డిమాండ్ ఉందే అర్థం చేసుకోవచ్చు. ఇక ఓవర్సీస్‌లోనూ హనుమాన్ పై చేయి సాధించింది. యూఎస్‌లో 369 లొకేషన్ల నుంచి 408k డాలర్లను వసూళ్ చేస్తే.. 409 లొకేషన్ల నుంచి గుంటూరు కారం 334k డాలర్లను మాత్రమే వసూళ్ చేసింది. అంటే హనుమాన్‌ను ఇకపై గుంటూరు కారం అందుకోవడం కష్టమే అన్నట్టుగా తెలుస్తోంది. చూస్తుంటే గుంటూరు కారంను కుర్చీ మడత పెట్టి.. పక్కన పడేసింది హనుమాన్.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago