Gunturu Kaaram: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటించిన గుంటూరు కారం సినిమా థియేటర్ల లోకి విడుదల అయింది. భారీ అంచనాల నడుమ సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయం వసూళ్ల వర్షం కురిపిస్తుంది అంటూ అభిమానులు కూడా ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు.. కానీ అభిమానుల అంచనాలను గుంటూరు కారం సినిమా తలకిందులు చేసేసింది. కోట్లు సంపాదిస్తుంది అనుకున్న ఈ సినిమా కనీసం వారం రోజులు కూడా థియేటర్లో ఆడుతుందా లేదా అన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మూవీకి టాక్ కాస్త తేడాగా ఉండడంతో త్రివిక్రమ్ మళ్లీ దెబ్బేసాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అజ్ఞాతవాసి సినిమాతో కంపేర్ చేస్తూ గుంటూరు కారం సినిమాపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే గుంటూరు కారం టాక్ కాస్త అటు ఇటు అవ్వగానే కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం మనం సేఫ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా గుంటూరు కారం సినిమా రిజల్ట్ చూసి ఎన్టీఆర్ అభిమానులు కొందరు చంకలు గుద్దుకుంటున్నారు. గుంటూరు కారం ప్లేస్ లో త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా ఉండాల్సింది. ఆ సినిమా మిస్ అయినందుకు ఎన్టీఆర్ అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అరవింద సమేత వీరరాఘవ సినిమా చేసి హిట్ కొట్టిన వెంటనే ఎన్టీఆర్-త్రివిక్రమ్ కలిసి ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. #NTR30గా అనౌన్స్ అయిన ఈ సినిమా ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సెకండ్ ప్రాజెక్ట్ అవుతుందని అంతా అనుకున్నారు.
త్రివిక్రమ్ ప్లేస్ లో కొరటాల శివ..
అయిననూ పోయి రావాలె హస్తినకు అనే టైటిల్ కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యింది. ఢిల్లీ బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ సెట్ అవుతుందనుకున్నారు కానీ మిస్ అయ్యింది. దీంతో త్రివిక్రమ్ ప్లేస్ లో కొరటాల శివ వచ్చి చేరాడు, ఇదే దేవర సినిమా అయ్యింది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడం మంచిదయ్యింది అనే వాళ్లు అరవింద సమేత సినిమాలోని ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ ని, టార్చ్ బేరర్ అంటూ త్రివిక్రమ్ రాసిన డైలాగులని మర్చిపోయి ఉంటారు. ఒక్కసారి వెనక్కి తిరిగి 2018ని చూస్తే ఆర్ఆర్ఆర్ కి వెళ్లిపోయి ముందు మూడున్నర ఏళ్లు ఎన్టీఆర్ కనపడకపోయినా ఎలాంటి లోటు కనిపించని సినిమాని ఇచ్చాడు త్రివిక్రమ్. నెక్స్ట్ ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుందో తెలియదు కానీ ఎప్పుడు సెట్ అయినా కూడా సాలిడ్ సినిమాని ఆడియన్స్ కి ఇస్తారు.
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…
ఇటీవలి కాలంలో “2026లో ప్రపంచ యుద్ధం జరుగుతుందా?” అనే చర్చలు సోషల్ మీడియాలో వేగంగా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా పురాణాల్లోని కొన్ని…
పూజా గదిలో నీళ్లు ఉంచే ఆచారం వెనుక అసలు కారణం ఏమిటి? చాలా మంది ఇళ్లలో ఇది సాధారణంగా కనిపించే…
జన్మతేదీల ఆధారంగా వ్యక్తిత్వం, ఆర్థిక స్థితి గురించి అంచనాలు చెప్పే సంఖ్యాశాస్త్రంపై ఆసక్తి పెరుగుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొన్ని…
వయస్సు పెరగడం సహజ ప్రక్రియే. అయితే సరైన జీవనశైలిని పాటిస్తే వృద్ధాప్య ప్రభావాన్ని కొంత వరకు తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు…