Movie News

Prasanth Varma: జై హనుమాన్ కంటే ముందు ఆ హీరోతో సినిమా చేయబోతున్న ప్రశాంత్ వర్మ.. ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్?

Prasanth Varma: టాలీవుడ్ లో ఉన్న యంగ్ డైరెక్టర్ లలో ఒకరైన ప్రశాంత్ వర్మ గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ పేరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాగే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కాగా ప్రశాంత్ వర్మ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం హనుమాన్. తేజ సజ్జా, అమ్రితా అయ్యర్ జంటగా నటించిన ఈ మూవీ జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా మంచి సక్సెస్ ను సాధించిన సందర్భంగా మూవీ మేకర్స్ ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

అలాగే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా రేంజ్‍లో ఫేమస్ అయ్యారు. దీంతో PVCUలో ప్రశాంత్ వర్మ తర్వాత చేసే సినిమా ఏది అని ఇంటర్నెట్‍లో చాలా మంది వెతికేస్తున్నారు. అయితే హనుమాన్ చిత్రానికి సీక్వెల్‍గా జై హనుమాన్ వస్తుందని సినిమా ఆఖర్లో మూవీ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. 2025లో జై హనుమాన్ వస్తుందని ఖరారు కూడా చేశారు. అయితే ఈ చిత్రం కంటే ముందు ప్రశాంత్ వర్మ మరో సూపర్ హీరో మూవీ చేయనున్నారటీ. ఆ సినిమా పేరు అధీర. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ స్ట్రైక్ గ్లింప్స్ కూడా గత ఏడాదిలోనే విడుదల చేశారు.

అధీర చిత్రంతో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు కల్యాణ్ దాసరి హీరోగా పరిచయం కానున్నారు. ఈ మూవీలో హీరోకు కరెంట్ షాక్ లాంటి అతీత శక్తి ఉంటుందని చూపించారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. బ్లాక్ సూపర్ హీరో డ్రెస్‍లో అధీర లుక్ అదిరిపోయింది. చివర్లో చూపించే వజ్రాయుధం లాంటిది కూడా ఇంట్రెస్ట్ పెంచేసింది. అధీర చిత్రాన్ని హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రైమ్ షో ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. హనుమాన్‍కు బీజీఎం ఇచ్చిన గౌరహరి మ్యూజిక్ డైరెక్టర్ కాగా శివేంద్ర దాశరథి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు. అధీర చిత్రాన్ని ఈ ఏడాదే రిలీజ్ చేయాలని ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నారు.

ఆ మూవీ తర్వాతనే జై హనుమాన్..

ఈ మూవీ తర్వాత జై హనుమాన్ మొదలుపెట్టి 2025 లో రిలీజ్ చేసేలా ప్రణాళికలు రచించుకున్నారు ప్రశాంత్ వర్మ. అయితే ప్రశాంత్ వర్మ దశకత్వం వహిస్తున్న తదుపరి సినిమా అధీర గురించి త్వరలోనే అప్‍డేట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా, తన సినిమాటిక్ యూనివర్స్ PVCUలో 12 చిత్రాలు వస్తాయని ప్రశాంత్ వర్మ ఇదివరకే వెల్లడించారు. దీంతో ప్రశాంత్ వర్మ తదుపరి సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 hour ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

2 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

2 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

19 hours ago

పేద దేశాల నుంచి వలసలకు బ్రేక్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా భవిష్యత్తుపై ఆందోళన

అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…

20 hours ago

మన బట్టలపై కనిపించే S, M, L సైజ్ ట్యాగ్ వెనుక భారీ చరిత్ర..

ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…

21 hours ago