Featured

Dynamic Star Manchu Vishnu : డైనమిక్ స్టార్ విష్ణు మంచుకు పుట్టినరోజు శుభాకాంక్షలు

Dynamic Star Manchu Vishnu : కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్ బాబు అంటే క్రమశిక్షణకు మారుపేరు అని సినీ పరిశ్రమలో అందరూ చెబుతారు. ఆయన వారసుడిగా పరిశ్రమలో ప్రవేశించిన విష్ణు మంచు తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. నటనలో, నాయకత్వ లక్షణాల్లో తండ్రికి తగ్గ వారసుడు అని అభినందనలు అందుకుంటున్నారు. ఈ రోజు విష్ణు మంచు బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు. 

అభిమానులు, ప్రేక్షకులు విష్ణు మంచుకు ‘డైనమిక్ స్టార్’ అని బిరుదు ఇచ్చారు. అది నిజమే అనిపిస్తుంది. విష్ణు యాక్టింగ్, ఫైట్లలో డైనమిజం కనబడుతుంది. కంప్లీట్ ఫ్యామిలీ అంతా చూసే యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌తో కమర్షియల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. విష్ణు లాస్ట్ ఫిల్మ్ ‘జిన్నా’ తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళంలో రిలీజ్ అయ్యింది. డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. అందులో విష్ణు, సన్నీ లియోన్ డ్యాన్స్ చేసిన ‘జారు మిఠాయి’ సాంగ్ చాలా పాపులర్ అయ్యింది. కొంత మంది ఆ పాటను తమ సినిమా ప్రమోషన్స్ కోసం యూజ్ చేసుకున్నారు. ‘ఢీ’,  ‘దేనికైనా రెడీ’, ‘దూసుకెళ్తా’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’, ‘రౌడీ’, ‘ఈడో రకం ఆడో రకం’ హిట్స్ తర్వాత ఇప్పుడు ‘ఢీ & ఢీ’ చేయడానికి విష్ణు రెడీ అవుతున్నారు.

రియల్ లైఫ్‌లో కూడా విష్ణు మంచు డైనమిక్‌గా ఉంటారు. తప్పును తప్పు అని, ఒప్పును ఒప్పు అని చెబుతారు. ‘మా’ అధ్యక్షుడిగా కళాకారులకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తున్నారు. నాయకుడిగా మన్ననలు అందుకుంటున్నారు. హ్యాపీ బర్త్ డే విష్ణు మంచు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రాజా రవీంద్ర ఫ్యామిలీ ఫోటోలు వైరల్.. మనవళ్లు చూస్తే మురిసిపోతారు

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…

6 hours ago

గ్యాస్ రాలేదు.. కానీ డెలివరీ మెసేజ్ వచ్చింది! వినియోగదారుడికి షాక్

వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…

6 hours ago

‘పాపం ప్రతాప్‌’ రివ్యూ.. కొత్త కథ, కానీ కుదరని ప్రయత్నం

తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్‌’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…

6 hours ago

జేడీ చక్రవర్తి భార్య గురించి షాకింగ్ నిజం.. తెలుగులోనే హీరోయిన్..!

తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…

6 hours ago

“మహిళల ఉసురు తగులుతుంది”.. అమిత్ షా ఫైర్‌తో రాజకీయాల్లో హీట్

లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…

7 hours ago

శ్రీరాముడిపై నాగబాబు వ్యాఖ్యలు.. రాజకీయంగా వేడెక్కిన చర్చ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…

7 hours ago