Featured

Srikanth -Ooha: విడాకుల వార్తలకు చెక్ పెట్టిన శ్రీకాంత్… మరోసారి తెరపైకి శ్రీకాంత్ ఊహ లవ్ స్టోరీ!

Srikanth -Ooha: వెండితెర నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శ్రీకాంత్ సహనటి ఊహను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విధంగా ఊహ శ్రీకాంత్ పెళ్లి చేసుకొని ఈ ఏడాదితో 25 సంవత్సరాలు పూర్తి కానుంది.పాతికేళ్లు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడిపిన ఈ దంపతులు విడిపోతున్నారంటూ వార్తలు రావడంతో ఒక్కసారిగా అభిమానులు బంధుమిత్రులు షాక్ అయ్యారు.

ఇలావీరి విడాకుల గురించి వార్తలు రావడంతో ఏకంగా వీరి బంధుమిత్రులు వారికి ఫోన్ చేసి ఓదార్చే వరకు ఈ వ్యవహారం వెళ్ళింది. ఇలా తమ గురించి అసత్యపు వార్తలు రావడంతో శ్రీకాంత్ చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ గురించి ఇలాంటి అసత్యపు వార్తలను సృష్టించిన కొన్ని యూట్యూబ్ ఛానల్ పై తాను చర్యలు తీసుకోబోతున్న అంటూ వార్నింగ్ ఇచ్చారు.

ఈ విధంగా శ్రీకాంత్ ఊహ విడాకులు తీసుకోబోతున్నారు అనే వార్తలకు పులి స్టాప్ పడినప్పటికీ మరోసారి శ్రీకాంత్ ఊహల లవ్ స్టోరీ తెరపైకి వచ్చింది.వీరిద్దరూ కలిసి మొదటిసారి ఆమె అనే సినిమాలో నటించారు. ఈ సినిమాతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో తిరిగి మరో నాలుగు సినిమాలలో నటించారు.ఇలా ఈ విషయాన్ని ఎక్కడ బయటకు చెప్పకుండా శ్రీకాంత్ తరచూ ఊహ ఇంటికి వెళ్లి తన కుటుంబ సభ్యులతో కూడా మంచిగా వ్యవహరించేవారు.

ప్రాణానికి ప్రాణంగా ఊహను ప్రేమించిన శ్రీకాంత్..

ఇక ఊహకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలియగానే ఈయన తన ఇంటికి వెళ్లి దేవుడి సాక్షిగా తాను ఊహను ప్రేమిస్తున్నానని తనని పెళ్లి చేసుకుంటానని చెప్పడమే కాకుండా తన మెడలో ఉన్నటువంటి బంగారు గొలుసు తీసి ఊహా మెడలో వేశారు. ఇలా వీరి ప్రేమ గురించి తెలియడంతో ఊహా దంపతులు షాక్ అయ్యారు. మొదట్లో ఊహ శ్రీకాంత్ ల పెళ్లికి తన తల్లిదండ్రులు నిరాకరించినప్పటికీ అనంతరం శ్రీకాంత్ వ్యక్తిత్వం తెలిసినవారు కావడంతో తమ కూతురిని శ్రీకాంత్ కి ఇచ్చి ఎంతో ఘనంగా 1997 వ సంవత్సరంలో వివాహం చేశారు. ఈ విధంగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఊహను పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండడంతో విడాకులు తీసుకోబోతున్నారనే వార్త వీరీలో ఒక్కసారిగా కంగారును పుట్టించింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago