శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో ఏదో మ్యాజిక్ ఉంటుంది… అతని సినిమాలు ఏ మాత్రం అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చే భారీ విజయాలను అందుకుంటాయి. ఈ క్రమంలోనే శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన గోదావరి, ఆనంద్, హ్యాపీ డేస్, ఫిదా వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విషయాలను అందుకున్నాయి. అందుకే శేఖర్ కమ్ముల సినిమా అంటే ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు కూడా అంచనాలను పెట్టుకుంటున్నారు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఎవర్ గ్రీన్ సినిమాలలో హ్యాపీ డేస్ ఒకటి. అందరూ కొత్త హీరోలతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ముఖ్యంగా యువతను ఎంతో అద్భుతంగా ఆకట్టుకుంది. చాలామంది ఈ సినిమాను చూసి వారి కాలేజీ రోజులను గుర్తు చేసుకుంటూ గడిపారు. ఇప్పటికీ ఈ సినిమా టీవీలలో ప్రసారం అయితే ఎంతో మంది యువత ఈ సినిమాను కన్నార్పకుండా చూస్తారు.
నలుగురు కాలేజీ యువకుల జంట మధ్య సాగే ప్రేమకథ ను ఎంతో అద్భుతంగా తీర్చి దిద్ది ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు శేఖర్ కమ్ముల.మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం ఈ సినిమాకు మరొక ప్లస్ పాయింట్ అయింది. హ్యాపీ డేస్ అంటూ… సాగిపోయే పాట ఎంతోమంది కాలేజీ యువతీయువకులను ఆకట్టుకుంది.
ఇప్పటికి కూడా కాలేజీలో సెండాఫ్ పార్టీ జరుగుతున్న సమయంలో ఈ పాటలు వినబడుతూ ఉంటాయి. కాలేజీ యువత మనసులో ఉన్నటువంటి భావాలను ఎంతో అద్భుతంగా తెరపై చూపించారు దర్శకుడు. ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలను అందుకొని నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను తెచ్చి పెట్టాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…