Featured

హ్యాపీడేస్ సినిమాలో క్యూట్ గా ఉండే టైసన్ ఇప్పుడు ఎలా మారిపోయాడో చుస్తే షాక్ అవ్వడం ఖాయం.. !!!

ఇక్కడ మీరు ఫోటోలు సిక్స్ ప్యాక్ తో బాలీవుడ్ హీరోలకు దీటుగా కనిపిస్తున్న హీరోను గుర్తు పట్టారా.? ఇతని పేరు రాహుల్ దయ కిరణ్.. ఈ పేరు చెప్తే ఎవ్వరికి తెలియకపోవచ్చు కానీ “టైసన్” అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. అదే ఇంకా హ్యాపీ డేస్ టైసన్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వం లో వచ్చిన హ్యాపీ డేస్ సినిమాతో చాలామంది తెలుగు సినిమాల్లో డెబ్యూ చేసారు. అందుకు టైసన్ అలియాస్ రాహుల్ ఒకరు. ఈ సినిమాతో మంచి ఆదరణ లభించిన అనుకున్న స్థాయిలో రాహుల్ కెరీర్ సాగలేదు.

2007 లో హ్యాపీ డేస్ విడుదల అయ్యి ఘనవిజయం సాధించగా ఈ పదమూడేళ్ల కెరీర్ లో రాహుల్ చేసినవి కేవలం హ్యాపీ డేస్ తో కలిపి ఏడూ సినిమాలు మాత్రమే. 2008 లో “రేయింబో” సినిమాలో నటించగా 2011లో “ముగ్గురు” సినిమాలో నడిచాడు ఇక 2013 లో “ప్రేమే ఒక మైకం” చిత్రం లో ఛార్మి సరసన నటించగా అదే సంవత్సరం “మ్యూజిక్ మేజిక్” అనే చిత్రం లో నటించాడు, ఇక 2014 లో “లవ్ యు బంగారం” చిత్రం లో నటించగా 2017 లో “వెంకటాపురం” అనే చిత్రం లో చివరగా నటించాడు. వెంకటాపురం సినిమాలో రాహుల్ సిక్స్ ప్యాక్ లో సైతం అలరించాడు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ ఉత్సహాహం తో మరో సినిమాలో కనిపిద్దామని రాహుల్ భావించిన గత నాలుగేళ్లుగా అది సాధ్యం కాలేదు.

ఎంతో ట్యాలెంట్ ఉన్న రాహుల్ సినిమాల్లో బిజీ కాకపోవడం నిజంగా బాధాకరం. సోషల్ మీడియాలో నిత్యం అందుబాటులో ఉండే రాహుల్ ఎప్పటికప్పుడు తనకు సంబందించిన అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నాడు. నిజామాబాదులో పుట్టి పెరిగిన రాహుల్ తండ్రి ఒక బిజినెస్ టైకూన్.. తాతల నుండి గార్మెంట్ బిజినెస్ లో ఉన్నారు. అలాగే రాహుల్ తో పాటు ఆయనకు సిస్టర్ రుతు కూడా ఉంది. ఇద్దరు కవలలు. గ్రాడ్యుయేషన్ చదువుతున్న సమయంలోనే శేఖర్ కమ్ముల సినిమాలో ఆడిషన్ లో సెలెక్ట్ అయ్యి హ్యాపీ డేస్ సినిమాకు ఎంపిక అయ్యాడు.

రాహుల్ కి 2015 లోనే పెళ్లయింది. వీరికి ఏడేళ్ల పాప యోగ్య కూడా ఉంది. ఎప్పటికైనా సినిమాల్లో సక్సెస్ అవ్వాలనే కోరికతో పర్ఫెక్ట్ బాడీ ని మైంటైన్ చేస్తున్నాడు రాహుల్. ప్రస్తుతం 100క్రోర్స్ అని ఒక యాక్షన్ సినిమా చేస్తున్నాడు. మరి ఈ సరికొత్త లుక్ తో టైసన్ ఎంతవరకు క్లిక్కవుతాడో చూడాలి. త్వరలోనే మరిన్ని ప్రాజెక్ట్ తో ప్రేక్షకులను అలరించాలని కోరుకుందాం. రాహుల్ దయ కిరణ్ ఫామిలీ ఫొటోస్ మీ కోసం.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

20 minutes ago

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

33 minutes ago

కష్టమే విజయానికి దారి – మృణాల్ ఠాకూర్ ప్రేరణాత్మక వ్యాఖ్యలు…

సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్‌ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…

47 minutes ago

“పాక్ అణు కేంద్రంపై భారత్ దాడి?.. రక్షణ నిపుణుడి వ్యాఖ్యలతో అంతర్జాతీయ కలకలం”

భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్‌’ సమయంలో భారత్ పాకిస్తాన్‌లోని కీలక అణు…

57 minutes ago

సింధ్ ఒప్పందం హక్కులతో భారత్ దూకుడు.. పాక్‌కు వెళ్లే నీటిపై చెక్..

భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్‌కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…

1 hour ago

అంబాజీ ఆలయానికి అనంత్ అంబానీ రూ.27.5 కోట్ల విరాళం.. ఐదేళ్లు భక్తులకు ఉచిత భోజనం!

భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…

1 hour ago