Reviews

HHVM Twitter Review : ‘హరి హర వీరమల్లు ట్విట్టర్ రివ్యూ ! పవన్ ఎంట్రీకి గూస్‌బంప్స్! [Live updates]

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఎట్టకేలకు జూలై 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమా విడుదలకు ముందే కొన్ని ప్రదేశాల్లో ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. దీంతో ట్విట్టర్‌లో సినిమాపై తొలి స్పందనలు, రివ్యూలు ఉరుకులు పెట్టాయి. ఇప్పటికే సినిమా టైటిల్ కార్డు, పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘Hari Hara Veeramallu’ Twitter Review! Goosebumps for Pawan’s entry!

పవన్ టైటిల్ ఎంట్రీకి గూస్‌బంప్స్: SKN ట్వీట్

ముఖ్యంగా పవన్ టైటిల్ ఎంట్రీపై ప్రముఖ నిర్మాత SKN స్పందిస్తూ, “TITLE ENTRY A RAMP 🔥” అంటూ ట్వీట్ చేశారు. దీంతో అభిమానుల్లో హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. థియేటర్ల వద్ద అభిమానులు భారీ కటౌట్లు, బ్యానర్లు, బైక్ ర్యాలీలతో పండుగ వాతావరణం సృష్టించారు. ఆడియెన్స్ రిపోర్ట్ ప్రకారం పవన్ స్క్రీన్ లో ఎంట్రీ ఇచ్చిన సన్నివేశం కేక పుట్టించిందట.

సినిమా నేపథ్యం, సాంకేతిక అంశాలు

ఈ సినిమా తొలుత క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమైంది. గ్లింప్స్, టీజర్ విడుదలైన వెంటనే విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. కానీ కరోనా, షూటింగ్ ఆలస్యం, రాజకీయ పరిస్థితుల వల్ల సినిమా పూర్తవ్వడంలో ఆలస్యం జరిగింది. చివరకు నిర్మాత ఎ.ఎం.రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించి చిత్రాన్ని పూర్తిచేశారు. మిథిక్ అండ్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించగా, ఆయన నేపథ్య సంగీతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని అభిమానులు చెబుతున్నారు.

ట్విట్టర్ ట్రెండింగ్, అంచనాలు

ప్రస్తుతం ట్విట్టర్‌లో #HariHaraVeeramallu, #HHVM, #PowerStarEntry హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. పలు ట్వీట్లు ఇలా ఉన్నాయి – “Pawan Kalyan TITLE ENTRY goosebumps 🔥🔥🔥”, “Keeravani BGM is pure magic. Worth the wait.”, “Delay ayina parvaledu… but Power Star screen lo entry ante tsunami!”

ఈ చిత్రం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విడుదలవుతున్న తొలి సినిమా కావడం, పైగా చాలా కాలంగా ఆలస్యం కావడం వల్ల ఇది సినీ ప్రేక్షకుల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తిని రేకెత్తించింది. రేపు ఫుల్ పబ్లిక్ రివ్యూలు ఎలా ఉంటాయో వేచి చూడాలి కానీ, ప్రీమియర్ షో స్పందనలు మాత్రం ఈ సినిమాపై పాజిటివ్ బజ్‌ను మరింత పెంచుతున్నాయి.

సినిమా టైటిల్ కార్డు నుంచే ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేపారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ప్రత్యేక కార్డు ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి పేరు కూడా టైటిల్స్‌లో ఉల్లేఖించారు. హీరో ఎంట్రీ సీన్‌లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ ఫుల్ మాస్ అండ్ ఎనర్జీతో ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా మొత్తం నిడివి 162 నిమిషాలు కాగా, దాదాపు రెండు గంటల 42 నిమిషాలు సినిమాను ప్రేక్షకులు ఆస్వాదించనున్నారు.

“కొల్లగొట్టినాదిరో” పాటపై ట్విట్టర్ లో ఫుల్ హంగామా నడుస్తోంది. ఈ పాటకి పవన్ కళ్యాణ్ వేసిన స్టెప్స్‌కు థియేటర్లు literally షేక్ అవుతున్నాయని ఫ్యాన్స్ ట్వీట్స్‌లో ఊపందిస్తున్నారు. మ్యూజిక్, పవన్ స్టైల్ డాన్స్ కలయిక ఈ పాటను మరో లెవెల్‌కు తీసుకెళ్లిందని అంటున్నారు..

ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంది. ఎలివేషన్ సీన్స్, BGM ఒకదానికొకటి డామినేట్ చేస్తున్నాయా అన్నంత రేంజ్ లో ఉన్నాయని, అంతకు మించి పవన్ కళ్యాణ్ స్వాగ్, అప్పియరెన్స్ మాత్రం స్క్రీన్ మీద ఒక మ్యాజిక్ లా పని చేసిందిదాని పవన్ కళ్యాణ్ హై ఓక్టేన్ ఎనర్జీతో మెస్మరైజ్ చేసాడని..

ఇంటర్వెల్ ముందు వచ్చే డైలాగ్స్, స్క్రీన్‌పై తీసుకున్న లాజిక్స్ చూస్తుంటే… తెలుగు వారికీ, తమ భాష మీద, రాష్ట్రంపై గౌరవం ఉన్నవారికి గుండె నిండేలా థోప్ ఫీల్స్ కలుగుతాయని కొందరు ట్వీట్ చేస్తున్నారు.

మరికొందరు మాత్రం చార్మినార్ ఫైట్ చాలా బాగుందని, కానీ ఓల్డ్ స్క్రీన్ ప్లే ఉందని.. ఫస్ట్ హాఫ్ పూర్తయ్యే సరికి పూర్తిగా పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో అని, స్క్రీన్ ప్లే అంతగా ఆకట్టుకోలేదని ట్వీట్ చేస్తున్నారు.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago