హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఎట్టకేలకు జూలై 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమా విడుదలకు ముందే కొన్ని ప్రదేశాల్లో ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. దీంతో ట్విట్టర్‌లో సినిమాపై తొలి స్పందనలు, రివ్యూలు ఉరుకులు పెట్టాయి. ఇప్పటికే సినిమా టైటిల్ కార్డు, పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పవన్ టైటిల్ ఎంట్రీకి గూస్‌బంప్స్: SKN ట్వీట్
ముఖ్యంగా పవన్ టైటిల్ ఎంట్రీపై ప్రముఖ నిర్మాత SKN స్పందిస్తూ, “TITLE ENTRY A RAMP 🔥” అంటూ ట్వీట్ చేశారు. దీంతో అభిమానుల్లో హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. థియేటర్ల వద్ద అభిమానులు భారీ కటౌట్లు, బ్యానర్లు, బైక్ ర్యాలీలతో పండుగ వాతావరణం సృష్టించారు. ఆడియెన్స్ రిపోర్ట్ ప్రకారం పవన్ స్క్రీన్ లో ఎంట్రీ ఇచ్చిన సన్నివేశం కేక పుట్టించిందట.
Showtime #HariHaraVeeraMallu ! ⚡️🔥 pic.twitter.com/A63dUSCvcw
— Retro (@Retroo018) July 23, 2025
Title entry ye Ramp 🔥💥🔥💥🔥💥🔥🔥💥
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) July 23, 2025
సినిమా నేపథ్యం, సాంకేతిక అంశాలు
ఈ సినిమా తొలుత క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమైంది. గ్లింప్స్, టీజర్ విడుదలైన వెంటనే విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. కానీ కరోనా, షూటింగ్ ఆలస్యం, రాజకీయ పరిస్థితుల వల్ల సినిమా పూర్తవ్వడంలో ఆలస్యం జరిగింది. చివరకు నిర్మాత ఎ.ఎం.రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించి చిత్రాన్ని పూర్తిచేశారు. మిథిక్ అండ్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించగా, ఆయన నేపథ్య సంగీతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని అభిమానులు చెబుతున్నారు.
#HariHaraVeeraMallu
— RAJASAAB (@Rebel___Stan) July 23, 2025
Entry Bgm 🔥🔥💥💥💥 pic.twitter.com/sRCQHWiRCp
ట్విట్టర్ ట్రెండింగ్, అంచనాలు
ప్రస్తుతం ట్విట్టర్‌లో #HariHaraVeeramallu, #HHVM, #PowerStarEntry హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. పలు ట్వీట్లు ఇలా ఉన్నాయి – “Pawan Kalyan TITLE ENTRY goosebumps 🔥🔥🔥”, “Keeravani BGM is pure magic. Worth the wait.”, “Delay ayina parvaledu… but Power Star screen lo entry ante tsunami!”
Racha Racha 🤯🔥🔥🙏#HariHaraVeeraMallu #HHVM #PawanKalyan pic.twitter.com/SHLlzlHZ87
— ❝𝐎𝐣𝐚𝐬 𝐆𝐚𝐦𝐛𝐡𝐞𝐞𝐫𝐚❞ (@TheyCalllHim_OG) July 23, 2025
ఈ చిత్రం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విడుదలవుతున్న తొలి సినిమా కావడం, పైగా చాలా కాలంగా ఆలస్యం కావడం వల్ల ఇది సినీ ప్రేక్షకుల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తిని రేకెత్తించింది. రేపు ఫుల్ పబ్లిక్ రివ్యూలు ఎలా ఉంటాయో వేచి చూడాలి కానీ, ప్రీమియర్ షో స్పందనలు మాత్రం ఈ సినిమాపై పాజిటివ్ బజ్‌ను మరింత పెంచుతున్నాయి.
#HHVM it's started… superb name card (Thread) pic.twitter.com/lIq53Ejc0L
— Taraq(Tarak Ram) (@tarakviews) July 23, 2025
సినిమా టైటిల్ కార్డు నుంచే ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేపారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ప్రత్యేక కార్డు ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి పేరు కూడా టైటిల్స్‌లో ఉల్లేఖించారు. హీరో ఎంట్రీ సీన్‌లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ ఫుల్ మాస్ అండ్ ఎనర్జీతో ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా మొత్తం నిడివి 162 నిమిషాలు కాగా, దాదాపు రెండు గంటల 42 నిమిషాలు సినిమాను ప్రేక్షకులు ఆస్వాదించనున్నారు.
HARI HARA VEERA MALLU ❤️🔥❤️🔥❤️🔥❤️🔥
— Kingdom 👑 (@arun_kanakanti) July 23, 2025
🤌🤌❤️🔥Power Star ⭐ ⭐ ⭐ ❤️🔥👌👌 #HariHaraVeeraMallu #PawanKalyan #hariharaveeramallubookings pic.twitter.com/LlVvB7elFK
“కొల్లగొట్టినాదిరో” పాటపై ట్విట్టర్ లో ఫుల్ హంగామా నడుస్తోంది. ఈ పాటకి పవన్ కళ్యాణ్ వేసిన స్టెప్స్‌కు థియేటర్లు literally షేక్ అవుతున్నాయని ఫ్యాన్స్ ట్వీట్స్‌లో ఊపందిస్తున్నారు. మ్యూజిక్, పవన్ స్టైల్ డాన్స్ కలయిక ఈ పాటను మరో లెవెల్‌కు తీసుకెళ్లిందని అంటున్నారు..
కొల్లగొట్టినాదిరో 🥁🥁🥁🥁🥁🥁🥁
— Vinay Tandra (@vinay_tandra) July 23, 2025
థియేటర్లు షేక్ అవుతున్నాయి రా…. 👌👌👌👌👌💥💥💥💥💥#BlockbusterHittttttttttt 🔥 #HariHaraVeeraMallu
ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంది. ఎలివేషన్ సీన్స్, BGM ఒకదానికొకటి డామినేట్ చేస్తున్నాయా అన్నంత రేంజ్ లో ఉన్నాయని, అంతకు మించి పవన్ కళ్యాణ్ స్వాగ్, అప్పియరెన్స్ మాత్రం స్క్రీన్ మీద ఒక మ్యాజిక్ లా పని చేసిందిదాని పవన్ కళ్యాణ్ హై ఓక్టేన్ ఎనర్జీతో మెస్మరైజ్ చేసాడని..
ఇంటర్వెల్ ముందు వచ్చే డైలాగ్స్, స్క్రీన్‌పై తీసుకున్న లాజిక్స్ చూస్తుంటే… తెలుగు వారికీ, తమ భాష మీద, రాష్ట్రంపై గౌరవం ఉన్నవారికి గుండె నిండేలా థోప్ ఫీల్స్ కలుగుతాయని కొందరు ట్వీట్ చేస్తున్నారు.
#HHVM #HARIHARAVEERAMALLU first half excellent easy ga elevations scenes & bgm dominated each other ankunte @PawanKalyan swag and appearance highly octane magician on screen
— Anil Karthikeya (@BeSelfles) July 23, 2025
Interval mundhu dialogs and logics telugolaki rashtram basha abhimanam unodki thope feels
మరికొందరు మాత్రం చార్మినార్ ఫైట్ చాలా బాగుందని, కానీ ఓల్డ్ స్క్రీన్ ప్లే ఉందని.. ఫస్ట్ హాఫ్ పూర్తయ్యే సరికి పూర్తిగా పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో అని, స్క్రీన్ ప్లే అంతగా ఆకట్టుకోలేదని ట్వీట్ చేస్తున్నారు.
Intha Content Pettukuni Endayya Mee Negligence Entra Babu Inaallu🫨
— Singam 🚩 (@Singamsett61230) July 23, 2025
Charminar Fight and Twist Adiripoyai 💹🥳#HariHaraVeeraMallu
1st half Complete ✅
— мαнєѕн ρѕρκ™ 🦅 (@Kalyan_Cullt) July 23, 2025
One man show pk
thata Ni productions values ki 🙏 old screenplay 700 bokka #HariHaraVeeraMallu
#HHVM first Half is Good👌
— Taraq(Tarak Ram) (@tarakviews) July 23, 2025
అసలు కథ ఇంటర్వెల్ కి అయిదు నిమిషాల ముందు మొదలయ్యింది
మొత్తం మూడు ఫైట్స్ సూపర్⚡
(ముఖ్యంగా చార్మినార్ ఫైట్)
కొల్లగొట్టినాది సాంగ్ ఫీస్ట్🤩
Elovations+BGM+Direction 👍
VFX are adequate
ప్రమోషన్స్ మాత్రమే కాదు ఫస్ట్ హాఫ్ కూడా భుజాలపై మోసాడు @PawanKalyan

































