Krishnam Raju Home Tour: టాలీవుడ్ సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సీనియర్ హీరోగా ప్రభాస్ పెదనాన్న గా అందరికీ సుపరిచితమైన కృష్ణంరాజు ఇప్పటికే ప్రభాస్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రంలో కూడా కృష్ణంరాజు పరమహంస పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇక ఈ సినిమాలో కృష్ణంరాజు కూడా నటించడంతో పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా కృష్ణంరాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ క్రమంలోనే ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో భాగంగా కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి తన హోమ్ టూర్ చేసి చూపించారు.
ఈ క్రమంలోనే కృష్ణంరాజు ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు ఈ ఇంటిని చూసి ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే తన ఇంటి గురించి శ్యామల దేవి వివరిస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
సాధారణంగా కృష్ణం రాజు కుటుంబానికి దైవభక్తి ఎక్కువ కనుక ప్రతిరోజూ తప్పనిసరిగా తమ ఇంట్లో పూజా కార్యక్రమాలు పెద్దఎత్తున జరుగుతాయని వెల్లడించారు.అదేవిధంగా కృష్ణం రాజు గారికి పురాతన వస్తువులు అంటే ఎంతో ఇష్టం కనుక తమ ఇంటిలో ఎక్కువగా అలాంటి వస్తువుల కనబడతాయని ఈ సందర్భంగా శ్యామలాదేవి వెల్లడించారు.ఇకపోతే వీరి ఇంటిలో సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా పూర్తిగా బంగారంతో తయారుచేసిన పులి బొమ్మ ఎంతో అట్రాక్షన్ గా నిలిచింది.గత 30 సంవత్సరాల క్రితం ఇటలీ నుంచి ఈ బొమ్మను తీసుకు వచ్చామని ఇలాంటి బంగారపు పులి బొమ్మలు చాలా అరుదుగా ఉంటాయని శ్యామలాదేవి తెలియజేశారు.ఇక ఈ పులి బొమ్మ ప్రత్యేకత ఏమిటి అంటే 50 సంవత్సరాల తర్వాత తిరిగి దీనిని సరి కొత్తగా రూపొందించ వచ్చని ఈమె వెల్లడించారు.ప్రస్తుతం వీరి హోమ్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు వీరి ఇంటిని చూసి ఫిదా అవుతున్నారు.
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…
దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో దగ్గు సిరప్‌ల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు మందులు లేదా…
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ (NEET) పరీక్ష చుట్టూ గత కొంతకాలంగా వివాదాలు, పేపర్ లీక్…