Political News

“నా భార్య ఫోన్ కూడా ట్యాప్ చేసాడు..” రేవంత్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి భగ్గుమంటున్న వివాదం… సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలతో రాజకీయ వాతావరణం మరింత ఉద్విగ్నంగా మారింది. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి పలువురు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడని, ఓ హీరోయిన్‌ను బ్లాక్ మెయిల్ చేసి మై హోం భూజాకు రమ్మన్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

He even tapped my wife’s phone..” Kaushik Reddy’s sensational allegations against Revanth Reddy

హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్, బ్లాక్‌మెయిల్ ఆరోపణలు

రాత్రి 2 గంటలకు రేవంత్ రెడ్డి ఆ హీరోయిన్ కోసం మై హోం భూజా వెళ్లినట్లు చెబుతూ, ఆ రాత్రి ఏం జరిగిందో ఆయనే చెప్పుకోవాలంటూ పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. “ఇది మొదట మాత్రమే. త్వరలోనే అన్ని ఆధారాలతో బయటకు వస్తాను,” అని ఆయన స్పష్టం చేశారు.

వ్యక్తిగత ఫోన్ ట్యాపింగ్, ‘కామన్’ వ్యాఖ్యలపై విమర్శలు

రేవంత్ రెడ్డి గతంలో కాంగ్రెస్‌లో చేరిన విధానం, దుబాయ్‌లో ఆయన చేసిన కార్యాచరణలు అన్నీ తనకు తెలుసంటూ పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాదు, తన భార్య ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని ఆరోపిస్తూ… ‘‘రేవంత్ రెడ్డి భార్యాభర్తల మధ్య సంభాషణలు కూడా వినే స్థాయికి దిగజారాడు,’’ అని మండిపడ్డారు.

ఇటీవల ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ గురించి ‘‘ఇది కామన్’’ అని చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, అది మామూలు విషయం కాదని, ఈడీ, సీబీఐ వలయంలోకి తీసుకుని విచారణ చేయాలని డిమాండ్ చేశారు.

118 మంది ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు

రాష్ట్రంలోని బీఆర్ఎస్, బీజేపీ నేతలు, అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి చెందిన స్వంత మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారని ఆరోపించిన పాడి కౌశిక్ రెడ్డి… 118 మంది ఎమ్మెల్యేలు ఈ ట్యాపింగ్ బాధితులే అన్నవారు. తన ఆరోపణలపై రేవంత్ రెడ్డి కేసులు పెట్టవచ్చని, కానీ తాను ఏమాత్రం భయపడబోనని తేల్చి చెప్పారు.

రాజకీయ ఉత్కంఠ

ఈ ఆరోపణలతో రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేగింది. సీఎం రేవంత్ దీనిపై ఎలా స్పందిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ శిబిరం మరోసారి రేవంత్ రెడ్డిపై లైన్లో దూకడంతో, కాంగ్రెస్‌కు ఇది చిక్కుకి దారితీయబోతోందా అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.

telugudesk

Recent Posts

Cheating Wife : హోటల్ గదిలో భార్య, ప్రియుడు.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికేసింది.. వీడియో వైరల్!

Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…

6 hours ago

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…

6 hours ago

Allu Arjun : బన్నీని కలవాలంటే 42 రూల్స్ అంటూ హాట్ కామెంట్స్.. చివరికి వెనక్కి తగ్గిన బ్రాండ్ స్ట్రాటజిస్ట్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…

11 hours ago

24 ఏళ్ల తర్వాత ప్రత్యూష కేసులో తీర్పు.. నా కూతురుకి న్యాయం దక్కలేదు.. హీరోయిన్ ప్రత్యూష తల్లి కన్నీళ్లు..

తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…

12 hours ago

డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. మార్చి 8న రెండు కొత్త పథకాలు!

ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…

12 hours ago

AI దిగ్గజం అంథ్రోపిక్ ఎంట్రీ.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు మళ్లీ అలజడి?

అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…

12 hours ago