Pavithra Lokesh: ఆయన నా భర్త కాదు..కృష్ణ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది.. పెళ్లిపై పవిత్ర లోకేష్ క్లారిటీ?
Pavithra Lokesh: టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొద్ది రోజులుగా నటుడు నరేష్ నటి పవిత్ర లోకేష్ గురించి పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని, ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని వార్తలు షికార్లు చేశాయి. తాజాగా వీరిద్దరూ కలిసి మహాబలేశ్వరం వెళ్లి స్వామి వారి ఆశీస్సులు తీసుకోవడంతో వీరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలకు మరింత బలం చేకూరింది.
ఈ విధంగా వీరిద్దరి గురించి పెళ్లి వార్తలు వస్తున్న నేపథ్యంలో నటి పవిత్ర లోకేష్ ఒక కన్నడ మీడియాతో మాట్లాడుతూ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ ప్రస్తుతం తాను నరేష్ తో సహజీవనం చేస్తున్నానని మా ఇద్దరి రిలేషన్ కి కృష్ణ గారి ఫ్యామిలీ అనుమతి ఉండటం వల్లే మేమిద్దరం సహజీవనం చేస్తున్నామని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం నరేష్ ఫామ్ హౌస్ లో మేము ఉంటున్నామని పవిత్ర వెల్లడించారు.
ఇక నరేష్ మూడో భార్య గురించి ఈమె మాట్లాడుతూ ఆమె సరిగా ఉంటే కృష్ణ గారి కుటుంబం తనకే మద్దతు తెలిపేదని తనుభర్తతో కలిసి ఉండనని తెగేసి చెప్పడం వల్లే వారిద్దరు విడిపోయారని పవిత్ర లోకేష్ నరేష్ మూడో భార్య రమ్య గురించి తెలిపారు. ఇకపోతే ఈమె మొదటి భర్త గురించి కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మొదటి భర్త కన్నడ సీరియల్ నటుడు సుచేంద్ర ప్రసాద్ అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తలపై పవిత్ర లోకేష్ స్పందించారు.
సుచేంద్ర ప్రసాద్ అసలు తన భర్తే కాదని, మేమిద్దరం పెళ్లి చేసుకోలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. కేవలం మేమిద్దరం రిలేషన్ లో మాత్రమే ఉన్నామని మాకు పెళ్లి జరగలేదని తెలిపారు. పెళ్లి జరగనప్పుడు విడాకులు ఎలా వస్తాయి అంటూ ఈమె వెల్లడించారు. ఇలా పవిత్ర లోకేష్ సుచేంద్ర ప్రసాద్ గురించి, ఆయనతో ఉన్న సంబంధం గురించి చెప్పడమే కాకుండా నరేష్ తో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఓ వైభవంగా సాగుతున్న వివాహ వేడుక ఒక్కసారిగా కలకలం రేపింది. బంధుమిత్రులతో కిక్కిరిసిన రిసెప్షన్ కార్యక్రమంలో, అతిథిలా హాజరైన ఓ…
అదనపు మార్జిన్ ఇక అవసరం లేదు ఇప్పటివరకు బంగారం ఫ్యూచర్స్ కాంట్రాక్టులపై 3 శాతం, వెండి కాంట్రాక్టులపై 7 శాతం…
బిలియనీర్ల డైట్ సీక్రెట్స్.. జంక్ ఫుడ్, హెల్తీ ఆహారం మిశ్రితం ప్రతి జీవికి ఆహారం అవసరం. అది సరైన పద్ధతిలో…
ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తింటే వచ్చే ఆరోగ్య సమస్యలు ఈ రోజుల్లో పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి ఫాస్ట్…
అవసరానికి మించిన నిద్ర తీసుకోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు మనిషి ఆరోగ్యానికి నిద్ర అనేది చాలా ముఖ్యమైన అంశం.…
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ అనంత బాబు భార్య లక్ష్మీ…