Sitara: ఇది విన్నారా.. సితార ఫేవరెట్ హీరో మహేష్ బాబు కాదట.. మరెవరో తెలుసా?
Sitara: సాధారణంగా సెలబ్రిటీల పిల్లలకు వారి తల్లిదండ్రులే రోల్ మోడల్ గా ఉంటూ వారే ఫేవరెట్ హీరో హీరోయిన్లగా ఉంటారు.అయితే కొంతమంది మాత్రం వారి తల్లిదండ్రులు స్టార్ సెలబ్రెటీలు అయినప్పటికీ వారికి ఫేవరెట్ హీరో హీరోయిన్లు ఉంటారనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇంత చిన్న వయసులోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సితార సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.నిత్యం తన తండ్రి నటించిన సినిమాలలో పాటలకు డాన్స్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను అభిమానులను సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు చదువులో ముందుకు కొనసాగుతూనే మరోవైపు నటనపై ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలో పెన్ని అనే సాంగ్ లో సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే.
ఇక మహేష్ బాబు సితార మధ్య ఎలాంటి బాండింగ్ ఉంటుందో మనకు తెలిసిందే. మహేష్ బాబు తన కూతురు అంటే అమితమైన ప్రేమను కనుబరుస్తారు.ఇలా మహేష్ బాబు ముద్దుల కూతురుగా ఉన్నటువంటి సితార తాజాగా ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు.సితార ఫేవరేట్ హీరో ఎవరు అని ప్రశ్నించగా ఈమె చెప్పిన సమాధానం విని మహేష్ అభిమానులు ఖంగుతిన్నారు.
రౌడీ హీరో తన ఫేవరెట్ హీరో అంటున్న సితార..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్నటువంటి మహేష్ బాబుకు విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలోనే సితార ఫేవరెట్ హీరో కూడా మహేష్ బాబు అయి ఉంటాడని అభిమానులు భావించారు. కానీ సితార ఫేవరెట్ హీరో ఎవరనే విషయానికి వస్తే రౌడీ హీరో విజయ్ దేవరకొండ అంటే తనకు చాలా ఇష్టమని తనే తన ఫేవరెట్ హీరో అని ఈమె చెప్పడంతో ఒక్కసారిగా మహేష్ అభిమానులు షాక్ అయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…