Featured

Suriya : అరుదైన గౌరవం దక్కించుకున్న సూర్య.. ఆస్కార్ కమిటీ లోకి తొలి దక్షిణాది నటుడు…!

Suriya : గజినీ సినిమాతో తెలుగు వాళ్లకు పరిచయమైన హీరో సూర్య తమిళం అప్పటికే మంచి నటుడుగా గుర్తింపు ఉన్న హీరో. ఇక గజినీ సినిమా తరువాత తెలుగులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న సూర్య తమిళంలో తాను నటించిన సినిమాలను తెలుగులోకి డబ్బింగ్ చేసి తన మార్కెట్ పెంచుకున్నారు. అయితే సూర్య ఈ మధ్య కాలంలో తీసిన ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ సినిమాలు ఆస్కార్ వరకు వెళ్లాయి.

అరుదైన గౌరవం అందుకున్న సూర్య…

ఆస్కార్ అవార్డు సినిమాల్లో ఉన్న ఏ నటుడికైనా ఒక పెద్ద కల. అయితే ఇప్పటి వరకు ఏ భారతీయ హీరోను ఆస్కార్ వరించలేదు. ప్రతి ఏడాది ఏడో ఒక సినిమా ఆస్కార్ ముంగిట్లో నిలబడడం వెనక్కు రావడం సాధారణం అయింది. ఇక సూర్య నటించిన ఆకాశమే నే హద్దురా, జై భీమ్ సినిమాలు కూడా అలానే ఊరించి ఉసూరుమనిపించాయి. అయితే సూర్య మాత్రం అరుదైన అవకాశాన్ని అందుకున్నారు. ఆస్కార్ కమిటీకి రావాలని ఆస్కార్ – అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ సూర్యను ఆహ్వానించింది. ఆస్కార్స్ 2022, ఈ ఏడాది పురస్కార వేడుక కమిటీలో మొత్తం 397 మందికి చోటు కల్పించారు.

క్లాస్ ఆఫ్ 2002గా పిలవబడే ఈ కమిటీలో సూర్య శివకుమార్, బాలీవుడ్ హీరోయిన్ కాజోల్, ఫిమేల్ డైరెక్టర్ రీమా కగ్తి ఇండియానుండి ప్రతినిధులుగా వెళ్ళనున్నారు. తమిళ సినిమా ఇండస్ట్రీ నుండి తొలిసారి ఈ గౌరవాన్ని అందుకున్న నటుడుగా సూర్య అరుదైన ఘనత సాధించాడు. ఇక ఈ విషయం బయటికి రాగానే సూర్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సూర్య ఆకాశమే నీ హద్దురా సినిమాను హిందీ లో నిర్మిస్తూ ఒక గెస్ట్ రోల్ కూడా చేస్తున్నారు. ఈ సినిమాలో హీరో అక్షయ్ కుమార్. ఇక మాధవన్ సినిమా రాకెట్రీ: నంబి ఎఫెక్ట్ లో కూడా అతిధి పాత్రలో చేసాడు. బాల దర్శకత్వంలో సూర్య ఒక సినిమా చేస్తున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago