Featured

బాగా నటిస్తున్నానని కూడా వద్దన్నారు: సీరియల్ నటుడు శ్రీ కృష్ణ కౌశిక్

ఒకానొక సందర్భంలో అవకాశాల కోసం పెద్ద డైరెక్టర్లను కూడా కలవడం జరిగింది. ఇప్పుడు టాప్‌లో ఉన్న దాదాపు అందరు దర్శకులను కలిశానని బుల్లితెర నటుడు శ్రీ కృష్ణ కౌశిక్ అన్నారు. అలా కలిసిన తర్వాత అడ్వాన్స్ తీసుకున్న తర్వాత ఆ సినిమాల్లో వేషం లేదన్నారని ఆయన వాపోయారు. దానికి తన ప్రయత్న లోపమా, లేదంటే ఇంకేదైనా కారణమా అన్నది తనకు నిజంగా అర్థం కాలేదని ఆయన అన్నారు. చిన్నప్పటి నుంచి తాను ఇండస్ట్రీలో ఉన్నానన్న కౌశిక్, తన పేరు తెలియక పోయినా తన ముఖం చూస్తే అందరూ గుర్తు పడతారని ఆయన చెప్పుకొచ్చారు. పెద్ద డైరెక్టర్లకు సైతం తన పేరేంటో తెలియకపోయినా చూస్తే మాత్రం పలకరిస్తారని ఆయన అన్నారు.

కానీ వాళ్లను ఎప్పుడు కలవాలన్నది మాత్రం తనకు అర్థం కావడం లేదని శ్రీ కృష్ణ కౌశిక్ తెలిపారు. మామూలుగా అయితే రేపు సినిమా ఓపెనింగ్ అంటే ఈ రోజు వెళ్లి కలుస్తారు. అది కామన్‌గా ఇండస్ట్రీలో జరిగేదే. అది తెలుగైనా, ఇంకో ఇండస్ట్రీ అయినా కూడా ఆఫీస్ ఓపెన్‌ చూసి పూజ చేసి, క్లాప్ కొట్టాక అప్పుడు వెళ్లి కలుస్తాం మాములుగా అయితే అని ఆయన చెప్పారు.

ఇకపోతే కొన్ని కొన్ని సినిమాల్లో అయితే బాగా చేస్తున్నావని వద్దన్నారని ఆయన తెలిపారు. అది తన బ్యాడ్‌ లక్కేనా అని అప్పుడు ఆయన అనుకున్నట్టు కౌశిక్ వివరించారు. ఇదిలా ఉండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తాను నటించిన కిట్టుగాడు సీరియల్‌ను ట్యూషన్ ఎగ్గొట్టి మరీ చూసేవారని ఆయనే తనకు చెప్పినట్టు కౌశిక్ అన్నారు. ఆయన్ని కలిసినపుడు కూడా మనం కలిసి చేద్దామని అన్నారు. కానీ ఆ తర్వాత ఏమైందో, అసలు ఎక్కడ లోపం ఉంటుందో తనకు నిజంగా తెలియడం లేదని ఆయన చెప్పారు. తనకు నిజంగా చేసి నిరూపించుకుంటానన్న నమ్మకం ఉందన్న కౌశిక్, కానీ అవకాశాలు మాత్రం ఎందుకు రావట్లేదో తెలియడం లేదని ఆయన వివరించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago