ప్రొడక్షన్‌కు సంబంధించి వేరే వాళ్లకు అగ్రిమెంట్ అయిన తర్వాత అడ్వాన్స్ తిరిగి ఇవ్వడం అనేది ఒక రెండు, మూడు సినిమాలకు జరిగిందని ప్రముఖ నటి సుధ తెలిపారు. అలాంటి వాటిలో ఒకటి నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి గారికి తానింకా అడ్వాన్స్ ఇవ్వాల్సి ఉందని ఆమె స్పష్టం చేశారు. ఆయన ఒక క్యారెక్టర్ కోసం తనకు చెప్పినపుడు ఒక యాక్టర్‌కు ఉన్న ప్రాబ్లమ్ వల్ల ఒక ఇష్యూ అయిందని ఆమె తెలిపారు.
ఆ యాక్టర్ పేరు తాను చెప్పనన్న సుధ, ఆవిడకు మదర్ క్యారెక్టర్ చేయమని తనను అడిగినట్టు ఆమె వివరించారు. ఇప్పటివరకు చాలా మంది అగ్ర హీరోలకు మదర్‌గా నటించాను. అలా వాళ్లకు మదర్‌గా నటించానని చెప్పినపుడు ఒక రెప్యుటేషన్ ఉండేది. కానీ ఈ ఆర్టిస్ట్‌కు మదర్‌గా చేశానంటే మాత్రం తాను చెప్పుకోలేనని ఆమె చెప్పినట్టు సుధ స్పష్టం చేశారు.
లేదంటే మా ఇద్దరినీ పిలిపించి అడగండి. ఆవిడ ఒప్పుకుంటానంటే తాను మదర్ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకుంటానని ఆమె అన్నట్టు వివరించారు. ఒక వేళ ఆమె ఒప్పుకోకపోతే ఎవరు చేసింది ఒప్పో తెలుస్తుంది అని వారు అన్నట్టు ఆమె తెలిపారు. ఆ తర్వాత వాళ్లు ఏదో మాట్లాడుతూ ఆ ఆర్టిస్ట్‌ను అడిగారట. మీ క్యారెక్టర్ తనకిచ్చి, మదర్ క్యారెక్టర్‌ను సుధ గారికి ఇద్దామనుకుంటున్నాం. ఏమంటారు అని అన్నారట. అప్పుడు తను ఆవిడ నాకు మదరా ? అలాగైతే నేను ఆ సినిమానే చేయనండి అన్నారట. అలా ఆ క్యారెక్టర్ చేయకుండా అలానే మిగిలిపోయిందని, ఆ అడ్వాన్స్ కూడా అలానే ఉందని సుధ స్పష్టం చేశారు. అది ఏదో ఒక రోజు వారికి ఇచ్చేస్తానని కూడా ఆమె చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత కూడా ఆ అడ్వాన్స్ పంపిస్తానని అన్నా, ఆయన మాత్రం మీ దగ్గరే ఉంచండి. మళ్లీ ఫ్యూచర్‌లో ఎప్పుడైనా అవసరం వస్తుందని ఆయన అన్నట్టు ఆమె వివరించారు. ఒక వేళ ఆ ఆర్టిస్ట్‌కి గనక మదర్‌గా చేసి ఉంటే అందరూ తనను ఆమెకు మదర్ క్యారెక్టర్ ఎందుకు చేశావు అని అడుగుతారని సుధ అన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…