తనకు సపోర్ట్ చేసిన వాళ్లు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారని ప్రముఖ నటుడు రఘునాథ్ రెడ్డి అన్నారు. అలాంటి వాళ్లలో మోహన బాబు గారు ఒకరు అని ఆయన స్పష్టం చేశారు. ఆయనకు తనంటే చాలా ఇష్టం అని ఆయన చెప్పుకొచ్చారు. మామూలుగానే మోహన్ బాబు గారితో ఎవరూ జోక్ చేయరు. ఎందుకంటే ఆయనంటే అందరికీ భయం. కానీ తానొక్కడినే జోక్ చేస్తానని ఆయన తెలిపారు.
ఇకపోతే రామానాయుడు స్టూడియోలో ఓ సినిమాకు సంబంధించి కోర్టు సీన్ చేస్తున్నపుడు మోహన్ బాబు ఓ విషయంపై గట్టిగా అరిచారని ఆయన అన్నారు. దాంతో అక్కడున్న వారంతా వణికిపోయారని ఆయన తెలిపారు. అక్కడ అంతా గొడవ గొడవగా మారిపోయిందని రఘునాథ్ రెడ్డి చెప్పుకొచ్చారు. అప్పుడు తనని ఏం జరిగిందని అడిగే సరికి, తనకు ఏం అర్థం కాక అలానే నిలుచుండి పోయానని ఆయన చెప్పారు. అసలు నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావ్ అని తాను అనగానే, శ్రీహరి వచ్చి ఆయన తనని ఎస్వీ రంగారావు అనుకుంటారని అన్నట్టు ఆయన చెప్పారు. అప్పుడు తనకు విషయం అర్థమై, ఆయన చూసే చూపులకు తానెలా బాధ్యుడిని అని ఆయన అనేసరికి, ఒక్కసారిగా పక్కున నవ్వేసి అక్కడినుంచి ఆయన వెళ్లిపోయినట్టు రఘునాథ్ రెడ్డి వివరించారు.
ఇదిలా ఉండగా కోడి రామకృష్ణ గారు కూడా చాలా సినిమాల్లో అవకాశాలిస్తారని ఆయన చెప్పారు. తన నటన నచ్చి ఒక సినిమాలో చేయించుకున్న తర్వాత తప్పనిసరి తరువాతి సినిమాలకు మళ్లీ తనను పిలుస్తారు తప్ప, తనను ఆపే సమస్య ఉండదని ఆయన స్పష్టం చేశారు. అందరితోనూ తాను చాలా కంఫర్టబుల్‌గా ఉంటానని, వాళ్లు చెప్పిన టైం కంటే ముందే అక్కడ ఉండడానికి తాను ట్రై చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…