సాధారణంగా ప్రతి రోజూ మనం ఉదయం లేవగానే ఒక కప్పు కాఫీ తాగనీదే ఇతర కార్యకలాపాలను కొనసాగించరు. ఈ క్రమంలోనే కొందరు రోజు పరిమితం లేకుండా కప్పుల కొద్ది కాఫీలు తాగుతూ ఉంటారు. ఈ విధంగా ప్రతి రోజు అధిక మొత్తంలో కాఫీ తాగటం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయని కొందరు భావిస్తారు. అదే విధంగా అధిక మొత్తంలో కాఫీ తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు దూరం అవుతాయని మరి కొందరు భావిస్తారు. అయితే రోజులో మూడు కప్పుల కాఫీ తాగే వారికి అమెరాకాలోనో ఓ ప్రసిద్ధ హెల్త్ యూనివర్సిటీ ఓ శుభవార్తను తెలిపింది.
ప్రతి రోజుకు ఒక మనిషి కేవలం నాలుగు వందల మిల్లిగ్రాముల కెఫిన్ తీసుకున్నప్పుడే ఆ వ్యక్తి ఎంతో ఆరోగ్యవంతంగా, ఎలాంటి గుండెజబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉండగలరని నిపుణులు తెలియజేస్తున్నారు. కాఫీలో ఉండే కెఫిన్ మన శరీరంలోని నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. దీంతో మనం రోజంతా ఎంతో హుషారుగా ఉండగలుగుతాము.అయితే కెఫిన్ ఎక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఒక రకంగా చెప్పాలంటే కాఫీ ఒక మత్తుపదార్థాల కిందకి వస్తుంది.
ప్రతిరోజు 400 ml కెఫిన్ తీసుకున్న వారిలో గుండె సమస్యలు రావడం చాలా అరుదు అని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే కెఫినేటెడ్ కాఫీ తాగడం ఎంతో ఉత్తమమని నిపుణులు తెలియజేస్తున్నారు.ఈ విధంగా ప్రతి రోజు పరిమితికి మించకుండా కాఫీ తాగడం వల్ల గుండె జబ్బులు, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు.
సాధారణ వ్యక్తులు ప్రతిరోజూ 400 ml కెఫిన్ తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు కానీ, గర్భిణీ స్త్రీలు, పిల్లలకు పాలిచ్చే తల్లులు మాత్రం ప్రతిరోజు కేవలం 200ml మాత్రమే తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు. అది కూడా డాక్టర్లను సంప్రదించిన తరువాత మాత్రమే కాఫీ తాగాలని సూచించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…