సాధారణంగా చాలామంది బాదం పప్పు కిస్మిస్ వంటి డ్రైవ్ ఫ్రూట్స్ తినడం వల్ల ఎన్నో పోషకాలు అందుతాయని భావిస్తారు. ఈ క్రమంలోనే చాలామంది వీటిని పచ్చివిగా తినడానికి ఇష్టపడుతుంటారు. మరి కొందరు వీటిని వివిధ రకాల వంటలలో వేసుకొని తినడానికి ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే బాదంపప్పును చాలామంది పచ్చిగా తింటూ ఉంటారు.అయితే బాదం పప్పులను నానబెట్టి తీసుకోవడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను, పోషకాలను పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
రాత్రంతా నానబెట్టిన బాదం పప్పును మరుసటి రోజు ఉదయం అల్పాహారానికి ముందుగా తీసుకోవడం వల్ల మనం మెదడు ఎంతో చురుగ్గా పని చేస్తూ, జ్ఞాపకశక్తిని పెంపొందింప చేస్తుంది. నానబెట్టిన బాదం పప్పు అన్ని వయసుల వారికి కూడా జ్ఞాపకశక్తిని పెంచుతుంది. అదేవిధంగా నానబెట్టిన బాదం పప్పు మన శరీరంలో ఎంజైములను ఉత్పత్తి చేసి జీర్ణక్రియను పెంపొందింపజేస్తుంది.
నానబెట్టిన బాదం పప్పులు తినడం వల్ల మన శరీరానికి కావలసినంత ఫైబర్లు, ప్రొటీన్లు, విటమిన్లు మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. తద్వారా మన శరీరానికి కావలసినంత రోగ నిరోధక శక్తిని పెంపొందింప చేస్తుంది.మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి గుండె జబ్బులను కూడా తగ్గిస్తుంది.నానబెట్టిన బాదం పప్పును విటమిన్-సి అధికంగా ఉండటం వల్ల ఇది చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో దోహదపడుతుంది. అదేవిధంగా డయాబెటిస్ వంటి సమస్యతో బాధపడేవారికి బాదంపప్పు ఎంతో ప్రయోజనకరం.
చాలామంది నానబెట్టిన బాదం పప్పును పొట్టుతీసి తింటూ ఉంటారు. అయితే ఈ విధంగా పోట్టు తీయడం వల్ల ఎన్నో రకాల పోషక పదార్థాలను మనం వృధా చేసుకున్నట్లే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాదంపప్పు పొట్టులో కూడా అధిక మొత్తంలో ఫైబర్లు ఉంటాయి. కనుక పొట్టు తీయకుండా పొట్టుతో సహా తీసుకోవడం వల్లే మన శరీరానికి అదనంగా పోషకాలు అందుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…