కరోనా దేశవ్యాప్తంగా మొదటి దశ వ్యాపించిన తరుణంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించారు. ఈ క్రమంలోనే వలస కూలీలు ఎక్కడివారక్కడ ఉండిపోవడంతో ఎంతోమంది కాలినడకన తమ గ్రామాలకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే నటుడు సోనుసూద్ తన వంతు సాయంగా ఎంతోమంది వలస కార్మికులను తన సొంత ఖర్చులతో సొంతగూటికి చేర్చి అందరి దృష్టిలో రియల్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. అప్పటి నుంచి ఎవరైనా కష్టంలో ఉన్నానని చెబితే వెంటనే వారి కష్టాన్ని తీర్చే ఆపద్బాంధవుడిలా ఉండేవాడు.
ప్రస్తుతం రెండవ దశ వ్యాపిస్తున్న నేపథ్యంలోనే ఎంతో మందికి , రాష్ట్రాలతో సంబంధం లేకుండా అవసరం ఉన్న వారందరికీ సహాయం చేస్తూ వస్తున్నారు.ప్రస్తుతం ఆసుపత్రిలో తీవ్ర కొరతగా ఉన్న ఆక్సిజన్, బెడ్లు వంటి సౌకర్యాలను సమకూర్చడంలో కూడా సోనుసూద్ తన వంతు సహకారం అందిస్తున్నారు. ఈ కరోనా సమయంలో కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజలు సహాయం కోసం సోనుసూద్ వైపు చూస్తున్నారు. కేవలం సాధారణ ప్రజలే కాకుండా సెలబ్రిటీలు సైతం అతని సహాయం కోరుతున్నారు.
ఇటీవల సురేష్ రైనా సైతం సోనూసూద్ నుంచి ఆక్సిజన్ సిలిండర్ సాయం అందుకోగా లేటెస్ట్‌గా మరో ఇండియన్ క్రికెటర్‌కు సైతం అడగ్గానే సాయం చేశాడు సోనూసూద్.స్పిన్నర్ హర్భజన్ సింగ్ తనకు తెలిసినవారికి ఒకరికి రెండిసివర్ ఇంజెక్షన్ కావాలని దండం పెడుతూ సహాయం కోరగా.. సోనుసూద్ ను అడగాలంటే ఫ్యాన్స్
ట్యాగ్ చేశారు.
ఈ క్రమంలోనే సోను స్పందించి కర్ణాటకలో ఇంజక్షన్ అవసరమైన వారికి తప్పకుండా అందుతుందని తెలుపగా అందుకు హర్భజన్ సింగ్ సోనుసూద్ కి ధన్యవాదాలు తెలుపుతూ, దేవుడి ఆశీస్సులు వల్ల మీరు బాగుండాలని హర్భజన్ సింగ్ ప్రార్థించారు. ఈ విధంగా సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అడిగిన వారికి సహాయం చేస్తూ, దేశంలోనే రియల్ హీరో గా పేరు సంపాదించుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…