ప్రజలకే కాదు.. సెలబ్రటీలకు సోనూనే దిక్కు?

0
55

కరోనా దేశవ్యాప్తంగా మొదటి దశ వ్యాపించిన తరుణంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించారు. ఈ క్రమంలోనే వలస కూలీలు ఎక్కడివారక్కడ ఉండిపోవడంతో ఎంతోమంది కాలినడకన తమ గ్రామాలకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే నటుడు సోనుసూద్ తన వంతు సాయంగా ఎంతోమంది వలస కార్మికులను తన సొంత ఖర్చులతో సొంతగూటికి చేర్చి అందరి దృష్టిలో రియల్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. అప్పటి నుంచి ఎవరైనా కష్టంలో ఉన్నానని చెబితే వెంటనే వారి కష్టాన్ని తీర్చే ఆపద్బాంధవుడిలా ఉండేవాడు.

ప్రస్తుతం రెండవ దశ వ్యాపిస్తున్న నేపథ్యంలోనే ఎంతో మందికి , రాష్ట్రాలతో సంబంధం లేకుండా అవసరం ఉన్న వారందరికీ సహాయం చేస్తూ వస్తున్నారు.ప్రస్తుతం ఆసుపత్రిలో తీవ్ర కొరతగా ఉన్న ఆక్సిజన్, బెడ్లు వంటి సౌకర్యాలను సమకూర్చడంలో కూడా సోనుసూద్ తన వంతు సహకారం అందిస్తున్నారు. ఈ కరోనా సమయంలో కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజలు సహాయం కోసం సోనుసూద్ వైపు చూస్తున్నారు. కేవలం సాధారణ ప్రజలే కాకుండా సెలబ్రిటీలు సైతం అతని సహాయం కోరుతున్నారు.

ఇటీవల సురేష్ రైనా సైతం సోనూసూద్ నుంచి ఆక్సిజన్ సిలిండర్ సాయం అందుకోగా లేటెస్ట్‌గా మరో ఇండియన్ క్రికెటర్‌కు సైతం అడగ్గానే సాయం చేశాడు సోనూసూద్.స్పిన్నర్ హర్భజన్ సింగ్ తనకు తెలిసినవారికి ఒకరికి రెండిసివర్ ఇంజెక్షన్ కావాలని దండం పెడుతూ సహాయం కోరగా.. సోనుసూద్ ను అడగాలంటే ఫ్యాన్స్
ట్యాగ్ చేశారు.

ఈ క్రమంలోనే సోను స్పందించి కర్ణాటకలో ఇంజక్షన్ అవసరమైన వారికి తప్పకుండా అందుతుందని తెలుపగా అందుకు హర్భజన్ సింగ్ సోనుసూద్ కి ధన్యవాదాలు తెలుపుతూ, దేవుడి ఆశీస్సులు వల్ల మీరు బాగుండాలని హర్భజన్ సింగ్ ప్రార్థించారు. ఈ విధంగా సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అడిగిన వారికి సహాయం చేస్తూ, దేశంలోనే రియల్ హీరో గా పేరు సంపాదించుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here