Movie News

Hemachandra and Sravana Bhargavi :  వైరల్ అవుతున్న హేమ చంద్ర – శ్రావణ భార్గవిల విడాకుల వార్తలు…!

Hemachandra and Sravana Bhargavi : హేమచంద్ర, శ్రావణ భార్గవి సింగర్లుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేర్లు. సింగర్లగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్తులగా కూడా తమని తాము నిరూపించుకున్నారు. రైడ్ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే కొన్నేళ్లు కొనసాగిన వీరి ప్రేమ 2013 లో పెళ్లితో ఇద్దరూ ఒక్కటి అయ్యారు. వీరిద్దరి ప్రేమ బంధానికి గుర్తుగా ఒక పాప కూడా వుంది. పాప పేరు శిఖర చంద్రిక. ఎంతో అన్యోన్యంగా సాగుతున్న వీరి వివాహ బంధం గురించి ఒక వార్త అభిమానులను కలవరపెడుతోంది. వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారు అని ప్రచారం జరుగుతోంది.

కలవరపెడుతున్న హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల వార్త…

పెళ్లి తర్వాత కూడా ఇద్దరూ తమ కెరీర్‌ను ఫుల్‌ జోష్‌తో కొనసాగిస్తున్నారు. పెళ్లి తరువాత ఇద్దరూ కలసి బోల్ బేబీ బోల్ అనే సింగింగ్ ప్రోగ్రాంకు యాంకర్ లుగా వ్యవహారించారు. ఆ తరువాత మా టీవీ లో ప్రసారం అయిన సై సింగర్స్ ఛాలెంజ్ కూడా చేశారు. వీటితో పాటు రేడియో షోలు చేశారు. ఇక తాజాగా నెల రోజుల క్రితం ఇండియన్‌ ఐడల్‌ తెలుగు సింగింగ్‌ షోకు హేమచంద్ర, శ్రావణ భార్గవి గెస్టులుగా వచ్చి అందర్ని అలరించారు.

ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన ఓ వార్త మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీరిద్దరూ గత కొన్ని రోజులుగా విడిగా వుంటున్నారని, అంతే కాకుండా ఇద్దరూ విడాకులు తీసుకొనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇన్నేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజం ఎంత వుందో తెలియాలి అంటే ఇద్దరిలో ఒకరైనా స్పందించాలి. ఇకపైన హేమచంద్ర, శ్రావణ భార్గవిలు విడాకులపై స్పందిస్తారేమో వేచి చూడాలి.

Bhargavi

Recent Posts

నైటీ వేసుకుందన్న కోపం.. భార్యపై నిప్పంటించిన భర్త

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…

27 minutes ago

సైన్స్ vs నమ్మకాలు.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…

36 minutes ago

మెగాస్టార్ ఇంటి పక్కనే అల్లు అర్జున్ కలల గృహం.. రూ.80 కోట్ల మేన్షన్ నిర్మాణం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…

40 minutes ago

నాదెండ్ల భాస్కర్ రావు ఇకలేరు.. విభిన్న రాజకీయ ప్రయాణం ముగిసింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…

44 minutes ago

స్టార్ హీరోలు కూతుళ్లను సినిమాల్లోకి ఎందుకు పంపరంటే.. జేడీ షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…

50 minutes ago

పెళ్లి ముందు రాత్రే షూటింగ్..రమ్యకృష్ణ డెడికేషన్‌కు ఫిదా

సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…

60 minutes ago