Featured

Actress Nalini : ఆ రోజు రాధిక మా ఇంటికి వచ్చి నా భర్తను కొట్టింది.. : నటి నలిని

Actress Nalini : తమిళం, తెలుగు, మలయాళం కన్నడ మొదలగు భాషలలో హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆ తరువాత నెగెటివ్ పాత్రలలోనూ మెప్పించిన సీనియర్ నటి నళిని. ప్రస్తుతం సీరియల్స్ లోనూ నటిస్తున్నారు. చెన్నై లో పుట్టి పెరిగిన నళిని, అసలు పేరు రాణి. తనకు ఆరుగురు సోదరులు, తండ్రి కొరియోగ్రాఫర్ తల్లి డాన్సర్ కావడంతో నళిని ఏడో తరగతి చదివేటప్పుడే హీరోయిన్ అవకాశం వచ్చింది. కానీ నళిని కి నటించడం మీద ఆసక్తి లేదట, చదువుకోవాలని చాలా ఉండేదట, కానీ తన తల్లి ప్రోత్సాహంతో సినిమాల్లోకి వచ్చిన నళిని మొదటగా మలయాళం లో నటించింది. అక్కడే రాణి గా ఉన్న తన పేరును నళిని గా మార్చారు. ఇక ఆపై తమిళ, తెలుగు సినిమాల్లో అవకాశలు వచ్చాయి.

రాధికా ఆ రోజు నా భర్తను ఇంటికి వచ్చి కొట్టింది…

హీరోయిన్ గా తెలుగులో ప్రేమసాగరం, ఇంటిగుట్టు వంటి సినిమాల్లో నటించిన నళిని తోడు నీడ సినిమాతో మొదట తెలుగులో అడుగుపెట్టింది. ప్రేమ సాగరం సినిమా అప్పట్లో ఘన విజయం సాధించడంతో వరుస అవకాశలు వచ్చినా నటించడం ఇష్టం లేని నళిని అవుట్ డోర్ షూటింగ్స్ రానని సాకు చెప్పి ఆఫర్స్ కాదనుకుందట. ఇక అసిస్టెంట్ డైరెక్టర్ రామరాజన్ ను పెళ్లి చేసుకున్న నళిని ఆ తరువాత కొన్నేళ్లకు వీడిపోయారు. కానీ చాలా మ్యూచువల్ గా వీడిపోయామని నళిని చెప్పారు.

ఇక ఆ సమయంలోనే మేము వీడిపోతున్నామని తెలిసీ రాధిక వాళ్ళ ఇంటికి వచ్చి నళిని భర్తను కొట్టిందట. నళిని చిన్న పిల్లలు అసలు లోకం తెలియదు అలాంటి అమ్మాయిని బాధపెడతావా, తనకు నేను ఉన్నాను, తననూ తన బిడ్డలనూ నేను చూసుకుంటా అని చెప్పిందట. ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూ ల్లో నళిని పంచుకున్నారు. తన సొంత వాళ్లకు కూడా అలా చెప్పారో లేదో కానీ నాకు చెప్పారు. తను నాకు మంచి ఆప్తురాలు అంటూ రాధికను తలచుకున్నారు.

Bhargavi

Recent Posts

కళ్లద్దాలకు గుడ్‌బై..! లాసిక్‌తో క్లియర్ విజన్ సాధ్యం!

ప్రతిరోజూ కళ్లద్దాలు పెట్టుకోవడం, అవి మసకబారడం లేదా కాంటాక్ట్ లెన్స్‌లతో ఇబ్బందులు ఎదుర్కోవడం చాలా మందికి సాధారణ సమస్యగా మారింది.…

1 minute ago

మాటల కంటే మౌనం గొప్పది..! చాణక్యుడి ఐదు కీలక జీవన సూత్రాలు!

ఆచార్యుల బోధనల్లో జీవన విధానానికి సంబంధించిన అనేక సూత్రాలు కనిపిస్తాయి. వాటిలో మాటల నియంత్రణ, సహనం అనే అంశాలు ప్రత్యేకంగా…

9 minutes ago

60 మంది హీరోయిన్స్‌తో నటించిన ఏకైక హీరో.. చంద్రమోహన్ రికార్డు..!

సినీ రంగంలో సాధారణంగా ఒక హీరో, కొన్ని ఎంపిక చేసిన హీరోయిన్‌లతోనే ఎక్కువ సినిమాలు చేస్తుంటారు. ముఖ్యంగా గత కాలంలో…

2 hours ago

దోస పిండి నిల్వలో చిన్న తప్పు.. పెద్ద ఆరోగ్య సమస్యలకు కారణం!

దక్షిణ భారతీయుల రోజువారీ ఆహారంలో ఇడ్లీ, దోశలకు ప్రత్యేక స్థానం ఉంది. వేగవంతమైన జీవనశైలిలో సమయం ఆదా కోసం చాలామంది…

2 hours ago

డయాబెటిక్ న్యూరోపతి పెరుగుతోంది.. కారణాలు, నివారణ మార్గాలు తెలుసుకోండి!

మధుమేహం (డయాబెటిస్) వల్ల వచ్చే సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలంగా షుగర్ నియంత్రణలో లేకపోతే నరాలపై ప్రభావం పడే…

2 hours ago

నడుము నొప్పి బాధిస్తుందా? గంటల తరబడి కూర్చోవడం ప్రమాదం.. బ్యాక్ పెయిన్ తగ్గించే సింపుల్ టిప్స్!

నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…

5 hours ago