Nandamuri Balakrishna : ఈమధ్య దేశంలో కరోనా కేసుల పెరుగుదల మళ్ళీ మొదలైంది. ముఖ్యంగా సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. ఉపాసన కామినేని తనకు కరోనా పాజిటివ్ అని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. తరువాత కరణ్ జోహార్ పుట్టినరోజు వేడుకకు హాజరు అయిన కొంతమంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ కూడా ఈ కోవాలో చేరారు. ఇక ఈ మధ్య షారుఖ్ ఖాన్, దీపిక పదుకొనే కూడా కరోనా పాజిటివ్ అని తెలియజేసారు. ఇక ఇపుడు కరోనా లిస్ట్ లో నందమూరి బాలకృష్ణ చేరిపోయారు. ఇది అభిమానులను కలవరపెడుతోంది.
హోమ్ ఐసొలేషన్లో నందమూరి బాలకృష్ణ…
తాజాగా సినీ హీరో, హిందూపూర్ శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ కరోనా బారిన పడినట్లు తెలియజేసాడు. ఇటీవల చేయించుకున్న కరోనా పరీక్షల్లో పాజిటివ్ గా నిర్దారణ అయింది. ప్రస్తుతం హోం ఐసొలేషన్లో ఉన్నట్లు తెలియజేసారు. తాను పూర్తి ఆరోగ్యాంగా వున్నానని, గత రెండు రోజులుగా తనతో సన్నిహితంగా వున్న వారు కరోనా నిర్దారణ పరీక్షలు చేయించికోవాలని అందరికి సూచించారు. ఆయన కరోనా నుండి త్వరగా కోలుకోవాలని ఆత్మీయులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా అభిమానాన్ని చాటుకుంటున్నారు.
ఇక ప్రస్తుతం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహారిస్తున్న అన్ స్టాపబుల్ ప్రోగ్రాం త్వరలోనే మొదలుకానుంది. తాజాగా గోపించంద్ మలినేని దర్శకత్వంలో శృతిహాసన్ హీరోయిన్ గా ఒక సినిమా చేస్తున్నారు. దీని తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో విభిన్న చిత్రం చేయబోతున్నారు. ఇక బాలకృష్ణ కరోనా నుండి త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…