Murali Mohan : తెలుగు పరిశ్రమలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నిర్మాతగా మురళీ మోహన్ సుపరిచితులు. ఏమాత్రం బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోగా చిన్న సినిమాలతో మొదలై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక జయభేరి సంస్థను స్థాపించి అనేక సినిమాలను నిర్మించారు. తన సినిమాలతో కొత్త హీరోయిన్లను పరిచయం చేసిన మురళీ మోహన్ ఎన్నో సినిమాల్లో హీరోగా మెప్పించాడు. అప్పట్లో మధ్యతరగతి అమ్మాయిలకు అతనే డ్రీమ్ బాయ్. ఇక చాలా మందికి పక్కింటి కుర్రాడు, తమ సోదరుడు, తండ్రి లాంటి భావన కలిగించేలా ఆయన నటన సహజంగా ఉండేది.
జయచిత్ర తో పెళ్లి…
సినిమాల్లో అవకాశలు బాగానే వచ్చి హీరోగా బిజీగా ఉన్న రోజుల్లో ఎక్కువ సినిమాలు జయచిత్రతో చేయడం వళ్ళ ఒక తమిళ పత్రికలో మేము పెళ్లి చేసుకున్నట్లు రాసారు. ఇక మరుసటి రోజు వారాహి స్టూడియోకి షూటింగ్ వెళ్లగా అందరూ వింతగా చూసారు. ఇక నా మొదటి సినిమా హీరోయిన్ నన్ను చొక్కాపట్టుకుని పిలిచి నువ్వు జయచిత్రను పెళ్లి చేసుకున్నావా అని అడిగారు, లేదని చెప్పగా పేపర్ లో వచ్చిందని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఇక నా మొదటి సినిమా ప్రొడ్యూసర్ పూర్ణ చంద్రరావు గారు ఫోన్ చేసి రమ్మన్నారు. వెళ్ళాక ఆ పేపర్ వార్త గురించి అడిగారు నీపై నమ్మకం ఉంది కానీ అలాంటి ఉద్దేశం ఏదైనా ఉంటే మానుకో అని చెప్పారట. ఇక ఆ తరువాత ఇంటికి వెళ్ళాక నా భార్య పిల్లలు ఎలా అనుకుంటారో అని భయపడ్డాను.
కానీ నా భార్యని అడుగగా మీ గురించి నాకు తెలియదా అని అనింది. ఇక నా కూతురు ఉదయం నా దగ్గరికి మా స్కూల్ లో నా స్నేహితురాలు మీ నాన్న జయచిత్రను పెళ్లి చేసుకున్నాడట కదా అని అడుగగా, చేసుకుంటే నిన్ను పెళ్ళికి పిలుస్తాను అని చెప్పి వచ్చా అని చెప్పగానే నాకు చాలా ఆనందంగా అనిపించింది. వీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు పోగొట్టుకోకూడదు, వీరి ముందు చెడ్డవాడు కాకూడదని అనుకున్నానని చెప్పారు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…