Prashanth Neel: కేజిఎఫ్ 3 పై స్పందించిన ప్రశాంత్ నీల్..కేజిఎఫ్ చాప్టర్ 3 ఉన్నట్టా..లేనట్టా?
Prashanth Neel: సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ఎవరికీ తెలియదు. ఇలా సినిమా ఇండస్ట్రీలో ఊహించని విధంగా కొన్నిసార్లు సినిమాలు విడుదలయ్యాయి ప్రపంచం మొత్తం సినిమా వైపు తొంగి చూసేలా చేస్తుంటాయి. అలాంటి వాటిలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఇలాంటి విజయాన్ని అందుకుంది.
ఏవిధమైనటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కి అద్భుతమైన విజయాన్ని అందుకుని దేశం మొత్తం కన్నడ చిత్ర పరిశ్రమ వైపు తొంగి చూసేలా చేసింది. ఇకపోతే ఈ సినిమా మంచి విజయం కావడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా కేజిఎఫ్ చాప్టర్ 2 తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది.
ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కేజిఎఫ్ చాప్టర్ 3 ఉంటుందని ప్రతి ఒక్కరు భావించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి చిత్రబృందం స్పందిస్తూ తప్పకుండా కేజిఎఫ్ చాప్టర్ 3 ఉంటుందని వెల్లడించారు. తాజాగా ఈ సినిమా ఈ విషయంపై డైరెక్టర్ ప్రశాంత్ నీల్ స్పందించి ఈ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఒక మీడియా సమావేశంలో మాట్లాడిన ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చాప్టర్ 3 తీసే అవకాశం ఉంది. అది కూడా చేయాల్సిన సమయంలో తీస్తామని, ప్రేక్షకులు కేజీఎఫ్ ప్రపంచాన్ని ఎంతగానో ప్రేమించారు మేము కూడా దానిని కొనసాగిస్తాం అయితే ఎప్పుడు ఏంటి అనేది మాత్రం తెలియదు కానీ తప్పకుండా కేజిఎఫ్ 3 సినిమా తీస్తామంటూ ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్ ఈ సినిమా గురించి క్లారిటీ ఇచ్చారు. ఇక డైరెక్టర్ సైతం ఈ సినిమా గురించి క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…