టాలీవుడ్ ఇండస్ట్రీలో సురేఖా వాణి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించి తన అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సురేఖా వాణి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే అలాగే సురేఖవాణి గారాల కూతురు సుప్రిత కూడా సోషల్ మీడియాలో చలాకీగా,ఉత్సాహంగా ఉంటూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకొని హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ కూడగట్టుకుంది.
సుప్రిత నిత్యం ఏదో రకమైన పోస్టులతో సోషల్ మీడియాను అదరగొడుతూ అత్యధిక ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. అలాగే వీలున్నప్పుడల్లా అభిమానులతో లైవ్లో చిట్ చాట్ నిర్వహించి తనదైన స్టైల్లో సమాధానాలు చెబుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. సురేఖ తన కూతురిని సినీ ఇండస్ట్రీలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
తాజాగా సురేఖ వాణి గారాల కూతురు సుప్రీత లైవ్ చాట్ నిర్వహించగా అందులో ఓ అభిమాని సుప్రీతనీ మీరు టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఇస్తున్నారని అడగగా దానికి సమాధానంగా కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా సుప్రీత మాట్లాడుతూ ప్రస్తుతం చదువు పైనే ఎక్కువ ఫోకస్ పెట్టాను, అలాగే తనకిష్టమైన నటన మరియు డ్యాన్సు నేర్చుకోవడానికి తగిన శిక్షణ తీసుకుంటున్నానని ముఖ్యంగా డైలాగ్ స్పష్టంగా చెప్పడం కోసం, మాట్లాడటానికి ఒక గురువు సహాయం తీసుకుంటున్నారని సందర్భంగా తెలియజేసింది. నటన మీద ఆసక్తి ఉన్నప్పటికీ టాలీవుడ్ ఎంట్రీ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సుప్రీత తెలియజేస్తూ తన మనసులో మాటను చెప్పుకొచ్చింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…