వెండితెర అరంగ్రేటం పై క్లారిటీ ఇచ్చిన సురేఖ వాణి కూతురు సుప్రీత..!

0
119

టాలీవుడ్ ఇండస్ట్రీలో సురేఖా వాణి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించి తన అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సురేఖా వాణి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే అలాగే సురేఖవాణి గారాల కూతురు సుప్రిత కూడా సోషల్ మీడియాలో చలాకీగా,ఉత్సాహంగా ఉంటూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకొని హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ కూడగట్టుకుంది.

సుప్రిత నిత్యం ఏదో రకమైన పోస్టులతో సోషల్ మీడియాను అదరగొడుతూ అత్యధిక ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. అలాగే వీలున్నప్పుడల్లా అభిమానులతో లైవ్లో చిట్ చాట్ నిర్వహించి తనదైన స్టైల్లో సమాధానాలు చెబుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. సురేఖ తన కూతురిని సినీ ఇండస్ట్రీలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

తాజాగా సురేఖ వాణి గారాల కూతురు సుప్రీత లైవ్ చాట్ నిర్వహించగా అందులో ఓ అభిమాని సుప్రీతనీ మీరు టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఇస్తున్నారని అడగగా దానికి సమాధానంగా కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా సుప్రీత మాట్లాడుతూ ప్రస్తుతం చదువు పైనే ఎక్కువ ఫోకస్ పెట్టాను, అలాగే తనకిష్టమైన నటన మరియు డ్యాన్సు నేర్చుకోవడానికి తగిన శిక్షణ తీసుకుంటున్నానని ముఖ్యంగా డైలాగ్ స్పష్టంగా చెప్పడం కోసం, మాట్లాడటానికి ఒక గురువు సహాయం తీసుకుంటున్నారని సందర్భంగా తెలియజేసింది. నటన మీద ఆసక్తి ఉన్నప్పటికీ టాలీవుడ్ ఎంట్రీ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సుప్రీత తెలియజేస్తూ తన మనసులో మాటను చెప్పుకొచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here