సాధారణంగా మనం మన ఇళ్ళల్లో పెంపుడు కుక్కలని పెంచుకోవడం సహజమే. ఈ క్రమంలో ఎప్పుడు కుక్కలను ఇంటి సభ్యులుగా భావించి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. ఈ క్రమంలోనే వాటికి ఏదైనా ప్రమాదం తలెత్తితే ఎంతో విలవిలలాడి పోతారు.ఈ క్రమంలోనే కొన్ని కారణాల చేత ఆ కుక్కలు మరణిస్తే వాటికి అంత్యక్రియలను కూడా జరిపించడం ఇది వరకు చూసి ఉంటాము.కానీ కుక్క చనిపోతే విగ్రహం చేయించి దానికి పిండప్రదానం చేయడం ఎప్పుడైనా విన్నారా.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.
కృష్ణాజిల్లా బాపులపాడు మండలం అంపాపురం గ్రామానికి చెందిన సుంకర జ్ఞాన ప్రకాష్ అనే వ్యక్తి ఒక కుక్కని పెంచుకున్నాడు. దానికి శునకరాజు అనే పేరు పెట్టాడు. ప్రకాష్ కు తన కుక్క శునకరాజు అంటే ఎంతో ఇష్టం. అది కూడా ఇతను చెప్పే పనులన్నింటినీ అర్థం చేసుకుని ఎంతో చక్కగా చేసేది.అయితే అనారోగ్యం కారణంగా కుక్క మృతి చెందడంతో ఆ కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయారు.
చనిపోయిన తన పెంపుడు కుక్క శునక రాజుకు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే అంతటితో ఆగిపోకుండా తన పెంపుడు కుక్కను మరిచిపోలేక.. జ్ఞాన ప్రకాష్ ఏకంగా కాంస్య కుక్క విగ్రహాన్ని తయారు చేయించి , దానిని ప్రతిష్టించి,పిండ ప్రదానం చేశాడు.
ఊరంతా ఫ్లెక్సీలు వేయించి, పురోహితులను పిలిపించి కుక్కకు పిండ ప్రధానం చేసి అందరికీ భోజనాలు పెట్టించారు. ఈ విధంగా శునకరాజు పై జ్ఞాన ప్రకాష్ కు ఉన్న ప్రేమను చూసి కొందరు ఇదేం విడ్డూరం అంటూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…