కరోనా మహమ్మారి విజృంభిస్తున్న టైంలో కూడా టాలీవుడ్ న్యూ ట్రెండ్ ను సృష్టిస్తుంది. కమర్షియల్ బాట నుండి కొత్త ప్రయోగాల వైపు అడుగులేస్తుంది. తెలుగు ప్రేక్షకులు కూడా ఆ ప్రయోగాలను ఆదరించటం శుభ పరిణామనే చెప్పవచ్చు.
ఇక అసలు విషయానికి వస్తే.. ‘లాహిరి లాహిరి లాహిరిలో’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఆదిత్య ఓం ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన తెలుగు చిత్రాల్లో నటించి ప్రస్తుతం ఓ సరికొత్త ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి “బందీ” అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా హీరో ఆదిత్య ఓం మాట్లాడుతూ..
‘బందీ’ చిత్రం మొత్తం ఒకే ఒక్క పాత్రతో కధ నడుస్తుంది. ఇలాంటి ప్రయోగాత్మక సినిమా తెలుగులో ఇంతవరకూ రాలేదు. టాలీవుడ్ లో ఆ లక్కీఛాన్స్ నాకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నటించడం చాల ఆనందంగా వుంది. ఇప్పటి వరకూ నన్ను ఎలాగైతే ఆదరించారో ఇకపై కూడా అలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.” అంటూ “బందీ” చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆదిత్య ఓం అడవిలో తాళ్లతో కట్టి బంధించి ఉన్నారు. ఆయన ఒంటిపై నుంచి బల్లి పాకుతోంది. ప్రక్కనే వున్న చెట్టు మీద ఓ కొండచిలువ ఉంది. టోటల్ గా ఈ పోస్టర్ టాలీవుడ్ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించేలా వెరైటీగా వుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…