Categories: FeaturedMovie News

Hero Allari Naresh : 600 సిగరెట్లు కాల్చాను… దగ్గి దగ్గి నా ఆరోగ్యం ఏమైందంటే… నేను చనిపోయినపుడు నా కెరీర్ అయిపోయినట్లు…: హీరో అల్లరి నరేష్

Hero Allari Naresh : అల్లరి సినిమాతో హిట్ కొట్టి ఆ సినిమా పేరునే తన పేరుకు ముందు చేర్చుకున్న నటుడు అల్లరి నరేష్ డైరెక్టర్ ఈవివి సత్యనారాయణ గారి చిన్న కొడుకు. అల్లరి సినిమాతో మొదలయిన ప్రయాణంలో వరుసగా కామెడీ సినిమాలతో హిట్లు కొట్టిన నరేష్ మధ్యలో గమ్యం, శంభో శివ శంభో వంటి సినిమాల్లో నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక పెళ్లి తరువాత అంతగా సక్సెస్ లు అందుకోలేకపోయిన నరేష్ తన నటనకు ఛాలెంజింగ్ ఉన్న పాతరలను ఎంచుకుంటూ ‘నాంది’ అనే సినిమాతో మరోసారి మంచి హిట్ కొట్టాడు. ఇక తాజాగా ‘మారేడుమిల్లి ప్రజానీకం’ అనే సినిమాతో మరోసారి వచ్చారు. నాంది సినిమాలో సీరియస్ లుక్ తో ఒక మాంచి సక్సెస్ అందుకున్న నరేష్ మరోసారి అలాంటి సీరియస్ లుక్ తో యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్నారు. ఆ సినిమానే ‘ఉగ్రం’. మరోసారి విజయ్ కనకమెడల కాంబినేషన్ లో నాంది సినిమా తారువత చేసిన సినిమా ఉగ్రం. ఈ సినిమా విశేషాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు అల్లరి నరేష్.

అన్ని సిగరెట్లు తాగే సరికి హెల్త్ పాడైంది…

ఉగ్రం సినిమా గురించిన విశేషాలను తెలియజేస్తూ ఆ సినిమా కోసం సినిమా యునిట్ మొత్తం కష్టపడ్డాం అంటూ తెలిపారు నరేష్. సినిమాలో ఒక సీన్ కోసం దాదాపు నాలుగు రోజుల పాటు 600 వందల సిగరెట్లను కల్చాల్సి వచ్చిందని తెలిపారు. ఆ 600 సిగరెట్ల పొగతో పాటు సీన్ బ్యాక్ గ్రౌండ్ లో కూడా పొగ పెట్టి తీయడంతో ఆ పొగ చాలా వరకు పీల్చి జలుబు దగ్గుతో బాధపడ్డాను అంటూ చెప్పారు. బ్యాంకాక్ లో షూటింగ్ కోసం వెళ్లగా అక్కడ బాగా దగ్గడం చూసి చాలా మంది నాకు కరోనా వచ్చిందేమో అని మాస్కులు వేసుకుని తిరిగారు అంటూ కోలుకోవడానికి టైం పట్టిందని తెలిపారు.

నాంది సినిమా లాగే ఈ సినిమా కూడా ఒక కొత్త విషయం గురించి కథ నడుస్తుందని, ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని హీరో నరేష్ తెలిపారు. ఇక తన కెరీర్ లో ఇప్పటి దాకా దాదాపు 60 కి పైగా సినిమాలను చేసిన ఆయన మధ్యలో గ్యాప్ తీసుకోవడం వల్ల అందరూ ఇక కెరీర్ అయిపోయినట్లే అంటూ మాట్లాడారని మధ్యలో గ్యాప్ ఎక్కువ కావడం వల్ల సెకండ్ ఇన్నింగ్స్, థర్డ్ ఇన్నిగ్స్ అంటూ కామెంట్స్ చేశారు. కానీ నేను చనిపోయినపుడు నా కెరీర్ ముగిసినట్టు అంటూ నరేష్ అభిప్రాయ పడ్డారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago