Sreeja: మెగా డాటర్ శ్రీజ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ఈమె తన వ్యక్తిగత కారణాల వల్ల పెద్ద ఎత్తున వార్తలలో నిలిచారు. ఈమె తన ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని తన కుటుంబం నుంచి ప్రాణహాని ఉంది అంటూ పోలీసులను ఆశ్రయించడంతో అప్పట్లో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. ఇలా శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నటువంటి శ్రీజ అతనితో కొంతకాలం పాటు సంతోషంగా ఉన్నారు.
ఇక పాప పుట్టిన తర్వాత వీళ్ళిద్దరికీ వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా తన కూతురితో పాటు శ్రీజ తన తండ్రి వద్దకు చేరుకోగా ఈమెకు 2016వ సంవత్సరంలో రెండో పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత కూడా శ్రీజ మరొక కూతురికి జన్మనిచ్చారు. అయితే రెండో భర్త కూడా విభేదాలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. కానీ ఈ విషయాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం ఈమె తన ఇద్దరి కూతురు ఆలనా పాలనా చూసుకుంటూ పలు వ్యాపారాలను చేస్తూ ఎంతో బిజీగా సోలో లైఫ్ సో బెటర్ అనేలా బతుకుతున్నారో. ఇకపోతే తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక నెటిజన్ ఈమెను ఒక ప్రశ్న వేశారు. నాకు విడాకులు తీసుకోవాలని ఉంది కానీ నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నాతోనే ఉండు అంటూ నా భర్త చెబుతున్నారు మీరు ఎలాంటి సలహా ఇస్తారు అంటూ ఈమెను సలహా అడిగారు.
మూడో పెళ్లికి దూరమా..
ఈ ప్రశ్నకు శ్రీజ సమాదానం చెబుతూ నువ్వు నిజంగా నీ భర్తతో సంతోషంగా ఉన్నాను అనుకుంటే విడాకులు తీసుకోకు అంటూ సలహా ఇచ్చారు. అయితే ఈమె తన భర్తతో సంతోషంగా లేకపోవడం వల్ల విడాకులు తీసుకున్నారని అందుకే ప్రస్తుతం సింగిల్ లైఫ్ గడుపుతున్నారని తెలుస్తుంది. ఇక మూడో పెళ్లి కూడా చేసుకోవాలని ఆలోచనలో లేనని ఈ సందర్భంగా చెప్పకనే చెప్పారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…