Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు మద్దతుగా స్టార్ ప్రొడ్యూసర్…. పవన్ ను ఆశీర్వదించండంటూ?

Pawan Kalyan: ఆంధ్రలో ఎన్నికలు మరొక ఐదు రోజులలో జరగబోతున్నటువంటి తరుణంలో ప్రచార కార్యక్రమాలు తారాస్థాయికి చేరుకున్నాయి ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పిఠాపురంలో సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి తరుణంలో ఈయనకు సినీ సెలబ్రిటీల మద్దతు భారీగా లభిస్తుంది.

ఇప్పటికే జబర్దస్త్ కమెడియన్లు మొత్తం పిఠాపురం చేరుకొని పవన్ కళ్యాణ్ కు ఓట్లు వేయాలని కోరుతున్నారు అలాగే మెగా హీరోలు కూడా పిఠాపురంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలాగే మరి కొంతమంది దర్శకులు నిర్మాతలు కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలోని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ అధినేత సూర్యదేవర నాగవంశీ పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచారు.

ఇటీవల విశ్వక్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మే 13వ తేదీ ఎన్నికలు జరుగుతున్నాయి మే 12వ తేదీ ఆంధ్ర వారందరూ కూడా తమ సంస్థలకు చేరుకొని 13వ తేదీ ఓటు వేయాలని తెలిపారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా జనసేన పార్టీకి ఓటు వేసి మద్దతుగా నిలవాలని కోరారు అదే ఆయనకు మనం ఇచ్చే గొప్ప సేవ అని తెలిపారు.

అదే గొప్ప సేవ..
ఆంధ్రాలో ఓటు హక్కు ఉన్నటువంటి తెలుగు వాళ్ళు హైదరాబాద్లో చాలామంది ఉన్నారు. అందుకే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈయన కోరారు. మీ ఒక్క ఓటు గెలుపోటములపై తప్పనిసరిగా ప్రభావం చూపుతాయని ఈ సందర్భంగా నాగ వంశీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago