Featured

Hero Jagapathi Babu : నా ఆస్తులు పోడానికి కారణం నేనే… నా భార్య, నా పిల్లలు నా సినిమాలను చూడరు ఎందుకంటే…: హీరో జగపతి బాబు

Hero Jagapathi Babu : కుటుంబ కథా చిత్రాల హీరోగా మంచి పేరు తెచ్చుకున్న జగపతి బాబు అప్పట్లో శోభన్ బాబు గా పేరు తెచ్చుకున్నాడు. ఇద్దరు హీరోయిన్లు, లేదా మొగుడు పెళ్ళాల కాన్సెప్ట్ తో సినిమా ఇలా మహిళా ప్రేక్షకులను ఎక్కువ సొంతం చేసుకున్న జగపతి బాబు ఇండస్ట్రీలో ఉన్న అందరు హీరోల్లా కాదు, ముక్కుసూటిగా ఉన్నది మాట్లాడేస్తాడు. తన గురించైనా సరే లోపాలను చెప్తాడు. ఇక ఒకరిని పొగుడుతూ ఉండటం, భజన చేయడం రాదు కాబట్టే ఇండస్ట్రీలో పెద్దగా నన్ను ఎవరూ పట్టించుకోలేదు అంటూ చెప్పే జగపతి బాబు తనకు ఉమెన్ అంటే ఇష్టం కానీ విమెనైజర్ కాదు అంటూ ఘాటుగా చెప్పేస్తాడు. 60 ఏట అడుగుపెట్టిన జగపతి బాబు గారు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన ఫ్యామిలీ గురించి అలాగే సినిమాల గురించి మాట్లాడారు.

నా ఆస్తులు అలా పోయాయి…

జగపతి బాబు గారి ఫ్యామిలీ మొదటి నుండి సినిమా రంగంలో ఉంది. దీంతో ఆస్తులు అన్నీ బాగా ఉన్నాయి. కానీ జగపతి బాబు గారు హీరో అయ్యాక కూడా బాగానే రెమ్యూనరేషన్ అందుకుని సంపాదించినా ఉన్న ఆస్తులన్నింటినీ పోగొట్టుకున్నారు. చాలా వరకు జూదంలో ఆస్తులను పోగొట్టుకున్నారు అనే టాక్ జగపతి బాబు మీద వినిపిస్తుంది. అయితే ఈ రూమర్ మీద జగపతి బాబు మాట్లాడుతూ నేను కొందరిని నమ్మి ఇచ్చి డబ్బు పోగొట్టుకున్న అలాగే నా ఖర్చులకు పోయాయి. ఇక క్యాసినోలలోనూ కొంత పోయింది. ఎలా చూసినా నా డబ్బు నేనే పోగొట్టాను ఇంకెవరి మీద నిందలు వేయను అంటూ చెప్పారు. ఒకవేళ నేను జాగ్రత్త పడి డబ్బులను ఖర్చు చేయకుండా ఉండుంటే ఖచ్చిత్స్నగా ఈరోజు ఒక 1000 కోట్ల ఆస్తి ఉండేదేమో కానీ నేను డబ్బు నిలబెట్టుకునే మనిషిని కాదు అంటూ చెప్పారు.

తన భార్య, పిల్లలకు కూడా చెప్పేసాడట జగపతి బాబు నేను ఒక 30 కోట్ల ఆస్తి మాత్రం సంపాదించగలను, మన అవసరాలకు మీరు లగ్జరీ గా ఉండటాని అవి సరిపోతాయి. అంతకుమించి నేను చేయను నా వల్ల అంతే అవుతుంద అని క్లారిటీ కూడా ఇచ్చేశారట. సంపదకు మనం సంతోషంగా ఉండటానికి సంబంధం లేదు అంటూ చెప్పారు. ఇక తన సినిమలను తన ఇంట్లో భార్య, పిల్లలు చూడరంటూ, పెద్దగా పట్టించుకోరని చెప్పారు. ఒకవేళ ఏదైనా సినిమా బాగా హిట్ అయినా అవసరమా నీకు, ఇంత క్రేజ్ వచ్చి నువ్వు బిజీ అయిపోయి ఇదంతా ఎందుకు అన్నట్లుగా మాట్లాడుతారు అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

“వద్దు సరోజా” డైలాగ్ వెనుక షాకింగ్ నిజం.. డైరెక్టర్ కరుణాకరణ్ రివీల్!

ప్రేక్షకులను అలరించిన ప్రేమ కథా చిత్రాల వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను దర్శకుడు కరుణాకరణ్ వెల్లడించారు. ముఖ్యంగా “వద్దు సరోజా…

7 hours ago

వేసవి హీట్‌కు సహజ పరిష్కారం… ఈ పండు మీకు తెలుసా?

వేసవి వేడి రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో శరీరానికి చల్లదనం, తేమను అందించే సహజ ఆహారాల ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. ఇలాంటి…

8 hours ago

ఉసిళ్లు తింటారా నిజంగా? ఆశ్చర్యపరిచే గ్రామీణ సంప్రదాయం!

వేసవి చివరి దశలో లేదా వర్షాకాలం ప్రారంభానికి ముందుగా సాయంత్రం సమయంలో ఒక్కసారిగా గుంపులుగా ఎగిరే చిన్న పురుగులను చాలా…

9 hours ago

ఎక్కువ ఉప్పు తింటే… ఎముకలు బలహీనమవుతాయా?

రోజువారీ ఆహారంలో ఉప్పు వినియోగం అధికంగా ఉంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశముందని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.…

9 hours ago

సుదర్శన చక్రం అంటే కేవలం ఆయుధమా? దాగిన అర్థం తెలుసా!

హిందూ పురాణాల్లో విష్ణుమూర్తి చేతిలో కనిపించే సుదర్శన చక్రం అత్యంత శక్తివంతమైన ఆయుధంగా గుర్తింపు పొందింది. ఇది కేవలం యుద్ధ…

10 hours ago

జీవితానికి అసలు అర్థం ఇదేనా? కృష్ణుడి తత్త్వం చెబుతున్న సత్యం!

ఈ జగత్తులో ఉన్నదంతా భగవంతునిదే అన్న భావన హిందూ తత్వశాస్త్రంలో కీలకమైనది. ముఖ్యంగా శ్రీకృష్ణ తత్త్వంలో ఈ సిద్ధాంతానికి ప్రత్యేక…

10 hours ago