Manchu Lakshmi : మంచు మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన లక్ష్మి తన భాష యాసతో మరింత ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా ట్రోలర్స్ కి ఈమె ఏదైనా వేడుకలో మాట్లాడితే పండగే. ప్రస్తుతం టీవీ షోస్ చేయకుండా కేవలం సినిమాలతో బిజీగా ఉన్న లక్ష్మి మంచు రీసెంట్ గా మలయాళం సినిమా ‘మాంస్టర్’ లో లెస్బియన్ లాగా నటించి అందరినీ ఆశ్చర్య పరిచింది. తన నటనతో మల్లు అభిమానులను ఆకట్టుకుంది. ఇక తన తముళ్ళు విష్ణు, మనోజ్ లు కూడా సినిమాల్లో ఉన్నా పెద్దగా వీళ్ళ ఫ్యామిలీలో సక్సెస్ చూస్తోంది ఈ మధ్య కాలంలో మంచు లక్ష్మి అని చెప్పొచ్చు. మనోజ్ అయితే అసలు సినిమాలను మానేసి వ్యాపారం చూసుకుంటున్నాడు. తొందర్లో రెండో పెళ్ళికి కూడా సిద్ధమాయ్యడు అనే వార్తలు వినిపిస్తున్నాయి.
మనోజ్ పెళ్లి పై స్పందించిన లక్ష్మి…
ఇక పని మీద చిత్తూరుకు వచ్చిన లక్ష్మి కాళహస్తికి వెళ్లి దర్శనం చేసుకుని వచ్చారు. అక్కడ మీడియా ఎదురుపడగా తన సినిమాల గురించిన ప్రశ్నలు ఎదురాయ్యాయి. అలాగే ఇక ప్రస్తుతం వాళ్ళ ఫ్యామిలీలో హాట్ టాపిక్ గా నిలిచిన మనోజ్ రెండో పెళ్లి విషయం కూడా ప్రశ్నగా లక్ష్మి మంచు దగ్గరికి రాగానే తన పెళ్లి గురించి ఇపుడెందుకు అడుగుతున్నారు, అది కూడా గుడిలో ఎందుకు అడుగుతున్నారు అంటూ మాట దాటేసింది.
ఇక మంచు విష్ణు అప్ కమింగ్ సినిమాల గురించి కూడా నన్ను అడగకండి తాను కనిపిస్తే తననే అడగండి అంటూ సమాధానము ఇచ్చింది. ఇక తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ గురించి చెబుతూ ‘అగ్ని నక్షత్రం’ సినిమా త్వరలో విడుదల కానుందని చెప్పింది. ఇక శివరాత్రి రోజున ఒక డివోషనల్ సాంగ్ విడుదల చేయబోతున్నట్లు చెప్పింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…