Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు.. ఇలా నటుడిగా ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్న ఈయన త్వరలోనే రాజమౌళి డైరెక్షన్ లో పాన్ వరల్డ్ మూవీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే.
ఇలా వరుస సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానుల సొంతం చేసుకున్న మహేష్ బాబు త్వరలోనే పుట్టిన రోజు జరుపుకోబోతున్నారు. ఈ క్రమంలోనే ఈయన కెరియర్ లో ఎవర్గ్రీన్ సూపర్ హిట్ చిత్రమైనటువంటి మురారి సినిమాను తిరిగి విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో నటించిన నటీ నటులు ఈ సినిమా విశేషాలను తెలియజేస్తూ ఆసక్తికరమైన విషయాలను బయటపెడుతున్నారు.
ఈ సినిమాలో నటించిన నటి సుధ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని మురారి సంగతులను గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈమె మాట్లాడుతూ ఈ సినిమా సమయంలో ఒక సన్నివేశం షూటింగ్ జరుగుతున్న సమయంలో నేను మహేష్ బాబు హీరోయిన్ సోనాలి బింద్రేను బాగా ఆట పట్టించి ఏడిపించామని తెలిపారు.
సోనాలి బింద్రే…
అప్పటికే డైరెక్టర్ షాట్ ఓకే అన్నప్పటికీ తనని అలాగే ఏడిపించామని తర్వాత ఆమె మా దగ్గరికి వచ్చి డైరెక్టర్ ఓకే అని చెప్పినా మీరు నన్ను ఆట పట్టించారని నాకు తెలుసు అంటూ సరదాగా మాట్లాడిందని తెలిపారు. ఇలా మహేష్ బాబు హీరోయిన్ ఏడిపించారనే విషయాన్ని సుధా తెలియజేయడంతో మహేష్ బాబులో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అంటూ అభిమానులు షాక్ అవుతున్నారు.సాధారణంగా మహేష్ బాబు చాలా సైలెంట్ గా ఉంటారు కానీ ఆయన కూడా హీరోయిన్లను ఆట పట్టించడం ఏడిపించడం చేశారని తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…