Nagarjuna: టాలీవుడ్ నవ మన్మధుడు అక్కినేని కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయనకు విపరీతమైన అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఈయన ఆరు పదుల ఉన్నప్పటికీ ఈయనకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పాలి. అంతలా నాగార్జునను ఇష్టపడుతూ ఉంటారు ఇక హీరోయిన్లు కూడా నాగార్జునతో సినిమా అంటే ఎవరు కూడా నో చెప్పరు
నాగార్జున పక్కన సినిమాలలో నటించడానికి హీరోయిన్లు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా నాగార్జున పక్కన అవకాశం వస్తే చాలు అని ఎదురుచూసే హీరోయిన్లు ఉన్నారు కానీ ఆయన పక్కన నటించే అవకాశం వచ్చిన ఒక హీరోయిన్ మాత్రం బోలెడన్ని కండిషన్లు పెట్టి షాక్ ఇచ్చారంటూ ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.
మరి నాగార్జున పక్కన నటించడం కోసం కండిషన్ లు పెట్టిన హీరోయిన్ ఎవరు అనే విషయాన్ని వస్తే ఆమె మరెవరో కాదు సీనియర్ నటి జ్యోతిక. ఈమె తెలుగులో నాగార్జున సరసన మాస్ అనే సినిమాలో నటించారు. అలాగే చిరంజీవి ఠాగూర్ రవితేజ షాక్ వంటి సినిమాలలో నటించారు. ఈమె తెలుగులో నటించినది తక్కువ సినిమాలు అయినప్పటికీ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు..
కండిషన్లు పెట్టిన జ్యోతిక..
లారెన్స్ దర్శకత్వంలో నాగార్జున నటించిన ఈ సినిమా కోసం జ్యోతికను నాగార్జున లారెన్స్ ఇద్దరు సంప్రదించారట అయితే ఆమె నాగార్జున పక్కన నటించడానికి తాను సిద్ధమే కానీ ఈ కండిషన్లకు ఒప్పుకుంటే అంటూ కండిషన్లను చెప్పారట. 2004వ సంవత్సరంలో ఈ సినిమా విడుదలైంది జ్యోతిక సూర్యల వివాహం 2006లో జరిగింది. అప్పటికే సూర్యతో ఈమె ప్రేమలో ఉండటంతో తాను ఎలాంటి ఎక్స్పోజింగ్ సన్నివేశాలు చేయనని,రొమాంటిక్ సీన్లలో కూడా నటించనని ఇలాంటి వాటికి మీరు ఒప్పుకుంటేనే సినిమా చేస్తానని చెప్పారట. ఇక ఈమె చెప్పిన కండిషన్లకు నాగార్జున లారెన్స్ ఇద్దరు ఒప్పుకోవడంతో మాస్ సినిమాలో జ్యోతిక నటించారని తెలుస్తోంది.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…