Tollywood: సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ సెలబ్రెటీలుగా కొనసాగుతున్నారు అయితే ఇండస్ట్రీలోకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న కొంతమంది సెలబ్రిటీలు వారి పేర్లను మార్చుకున్నారు అయితే ఇలా ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత పేర్లు మార్చుకోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది.
ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత పేర్లు మార్చుకున్న హీరోలు ఎవరు అనే విషయానికి వస్తే..
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా గుర్తింపు పొందిన చిరంజీవి అసలు పేరు శివ శంకర్ వరప్రసాద్. ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత ఇంత పెద్ద పేరు పలకడం కష్టం అంతేకాకుండా ఇది వరకే శివ శంకర అనే సెలెబ్రెటీల కూడా ఉండటంతో హనుమంతుడికి మరో పేరు అయినా చిరంజీవి అనే పేరును తన పేరుగా పెట్టుకున్నారు.
ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నాని అసలు పేరు నవీన్ కుమార్ ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత తన పేరును కాస్త నానిగా మార్చుకున్నారు.
మరో మెగా హీరో అయినటువంటి పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత తన పేరును పవన్ కళ్యాణ్ అని పెట్టుకున్నారు అయితే తన నిజమైన పేరు కళ్యాణ్ కుమార్.
భక్తవత్సల నాయుడుగా ఉన్నటువంటి మంచు హీరో ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత మంచు మోహన్ బాబు అని పేరు పెట్టుకున్నారు.
ఇక జగపతి రావు చౌదరిగా ఉన్నటువంటి ఈయన ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తన పేరును జగపతి బాబుగా పెట్టుకున్నారు.
మాస్ హీరోగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు రవితేజ అసలు పేరు భూపతి రాజు రవి శంకర రాజు అయితే ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత ఈయన రవితేజ అని పెట్టుకున్నారు.
పేర్లు మార్చుకొని సక్సెస్ అయ్యారు..
దినేష్ నాయుడుగా ఉన్న తన పేరును విశ్వక్ సేన్ గా మార్చుకున్నాడు. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ రీసెంట్ గా తన పేరును ఆకాష్ జగన్నాథ్ గా ఛేంజ్ చేసుకున్నాడు. వీరితోపాటు సన్నీ చంద్ర అడివి శేష్‌గా పేరు మార్చుకున్నారు. ఇలా ఈ హీరోలందరూ తమ ఒరిజినల్ నేమ్స్ తో కాకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత పేర్లు మార్చుకొని మంచి గుర్తింపు పొందారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…