Nani: ఖైదీ సినిమా చిరంజీవి గారి కోసమే పుట్టిన కథ.. నాని షాకింగ్ కామెంట్స్!
Nani: ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుస సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నాచురల్ స్టార్ నాని తాజాగా అంటే సుందరానికి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఇంటర్వ్యూలో భాగంగా నానికి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.సాధారణంగా ఒక సినిమా కథను తయారు చేసుకున్న తర్వాత ఆ కథ డిమాండ్ బట్టే ఆర్టిస్టులను వెతుకుతూ వారి దగ్గరకు వస్తుందని ఈ సందర్భంగా నాని తెలిపారు. అలా అంటే సుందరానికి సినిమా నన్ను వెతుక్కుంటూ వచ్చిందని ఈ సందర్భంగా నాని తెలిపారు.
ఇకపోతే చిరంజీవి నటించిన ఖైదీ సినిమా గురించి నాని మాట్లాడుతూ.. నిజానికి ఖైదీ సినిమాని కృష్ణగారితో చేయాలని భావించారట. ఈ కథను కృష్ణగారు రిజెక్ట్ చేయడంతో అవకాశం చిరంజీవి గారికి వచ్చింది. ఇక చిరంజీవి గారి కోసమే ఖైదీ సినిమా కథ పుట్టిందని ఈ సందర్భంగా నాని చిరంజీవి సినిమా గురించి తెలియజేశారు.
ఇక నాని సరసన మొట్టమొదటిసారిగా మలయాళీ ముద్దుగుమ్మ నజ్రియా తెలుగు సినిమాల్లో నటించారు. ఇప్పటివరకు ఈమె ఎన్నో మలయాళ సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు పొందింది. ఇక ఈమె లొకేషన్లో ఉన్నప్పుడు ఎంతో ఎనర్జిటిక్ గా ఉండేదని ఈ సందర్భంగా హీరోయిన్ గురించి నాని పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.ఇక ఈ సినిమా జూన్ 10వ తేదీ విడుదల కావడంతో నేడు హైదరాబాద్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా రానున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…