Samantha & Naga Chaitanya : టాలీవుడ్ లో ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న హీరోలకు హీరోయిన్లకు కొదవలేదు. కానీ తెలుగు ఇండస్ట్రీలో క్యూట్ పెయిర్ అంటే మాత్రం సమంత, నాగచైతన్యదే. ఇద్దరు చూడచక్కని జంటగా ఉండేవాళ్ళు అయితే కారణాలు బయటికి చెప్పకపోయినా ఇద్దరు వీడిపోయారు, విడాకులు తీసుకున్నారు. ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. ప్రస్తుతం ఎవరి కెరీర్ లో వాళ్ళు బిజీగా ఉన్నా వారి గురించిన విషయాలు మాత్రం ఏదోఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి.
ఆ ప్రాజెక్ట్ సమంత బలవంతం పైనే….
తాజాగా నాగ చైతన్య, సమంత వారి వారి కెరీర్ లో బిజీగా ఉన్నారు. విడాకులు తీసుకున్నాక కెరీర్ లో ఇద్దరు బిజీ అయిపోయారు. సినిమాల విషయంలో పెళ్ళయ్యాక అచితూచి వ్యవహరించిన సమంత విడాకుల తరువాత గ్లామర్ డోస్ పెంచేసింది. ఇక నాగచైతన్య తన తాజా ప్రాజెక్ట్ థాంక్యూ సినిమాతో బిజీగా ఉన్నాడు. మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వములో ఈ సినిమా రాబోతోంది. ఇక ఈ సినిమా తరువాత చైతూ ధూత్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఇందులో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు చైతూ.
అయితే ఈ ప్రాజెక్ట్ మొదట సమంత వద్దకు వచ్చిందట, స్క్రిప్ట్ నచ్చడంతో చైతన్య ను చేయమని చెప్పిందట. నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర కావడంతో చైతు ఆలోచించినా సమంత బలవంతం చేయడంతో ఒప్పుకుని ప్రాజెక్ట్ పై సంతకం చేసాడట. ఇక సమంత నాగచైతన్య ప్రస్తుతం ఎవరి కెరీర్ లో వాళ్ళు ఉన్నా సమంత విడాకుల ముందు మాత్రం చైతూ కోసం చాలా చేసింది. చైతూ కెరీర్ కోసం చాలా ఆలోచించేదని అలాగే అక్కినేని కుటుంబం కోసం ఆలోచించేదని సామ్ అభిమానులు బాధపడుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…