Major cinema : అడవి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో వచ్చిన సినిమా మేజర్. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తీసిన చిత్రం మేజర్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలయి మంచి ఆదరణ అందుకుంది. మహేష్ బాబు గారి జీఎంబీ ఎంటర్టైన్మెంట్ , ఏ ప్లస్ ఎస్ మూవీస్ తో కలిసి సోని పిక్చర్ ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. సినిమాకు పాజిటివ్ స్పందన రావడంతో పాటు మంచి వసూళ్లను కూడా రాబడుతోంది. సందీప్ ఉన్నికృష్ణన్ గా అడవి శేష్, ప్రకాష్ రాజ్, రేవతి, శోభిత ధూళిపాళ్ళ, సయి మంజ్రేకర్ నటించారు.
రాయల్టీ విషయంలో సందీప్ పేరెంట్స్ అలా చేసారు…..
సినిమా మంచి విజయాన్ని అందుకుంది, ఇక సందీప్ పేరెంట్స్ సినిమాపై హక్కులకు గాను రాయల్టీని అందుకుని ఉండొచ్చన్న ఊహాగానాల నడుమ నిర్మాతలు అనురాగ్, శరత్ లు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. సినిమా మొదలు పెట్టక ముందే సందీప్ తల్లిదండ్రులను కలిసి రాయల్టీ విషయం మాట్లాడితే గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్ అంటూ అరిచి నా కొడుకు కథకు డబ్బులు తీసుకునేంత దీనస్థితిలో మేములేము అంటూ అన్నారని చెప్పారు.
సందీప్ మరణించాక వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులను కూడా తమ సన్నిహితులకు ఇచ్చేశామని సందీప్ పేరెంట్స్ వివరించినట్లు చెప్పారు. సందీప్ పేరెంట్స్ చాలా నిజాయితీ పరులు అంటూ నిర్మాతలు పేర్కొన్నారు. ఇక ఈ సినిమా రాయల్టీ డబ్బులను సైన్యంలో చేరాలనుకుంటున్న యువతకు సందీప్ ఫౌండేషన్ ద్వారా ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పారు. అదే వాళ్ళ పేరెంట్స్ కి ఇచ్చే రాయల్టీ అని నిర్మాతలు పేర్కొన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…